ఇంటర్నెట్ డెస్క్: ‘అదృష్టం మెయిన్ డోర్ తడితే.. మనం మాత్రం మాస్టర్ బెడ్‌రూంలో ముసుగు తన్ని పడుకుంటే ఎలా ఉంటుంది..? వాషింగ్టన్‌కు చెందిన ఓ వ్యక్తి ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. అతడి మతిమరుపు కారణంగా కోట్ల రూపాయలను పోగొట్టుకున్నాడు. దీంతో ఏం చేయాలో తెలియక నానా తంటాలు పడుతున్నారు. ఊహించని విధంగా వచ్చిన ఆ సంపద కళ్ల ముందున్నా.. తీసుకోలేని దీన స్థితికి చేరుకున్నాడు.

అమెరికాలో వాషింగ్టన్‌కు చెందిన స్టీఫెన్ థామస్ ప్రోగ్రామర్‌గా పనిచేస్తున్నాడు. డిజిటల్ కరెన్సీ ధర చాలా తక్కువగా ఉన్న సమయంలో 7000 బిట్ కాయిన్స్ కొలుగోలు చేశాడు. వాటి భద్రత కోసం ఓ ఐరన్ కీ ఖాతాలో బద్రపరిచి ఓ పాస్ వర్డ్ పెట్టుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో బిట్ కాయిన్ విలువ ఒక్కొక్కటి రూ.25 లక్షలు పైగానే పలికింది. దాంతో మొత్తం కాయిన్స్ విలువ ఒక్క సారిగా రూ.1753 కోట్లకు చేరుకుంది. ఊహించని ఈ లక్కుతో థామస్ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. అయితే తన ఖాతాలో ఉన్న కాయిన్లను విక్రయించి కోటీశ్వరుడు అయిపోవాలని అనుకున్నాడు. కానీ ఇక్కడే అతడికో షాక్ తగిలింది.

అదేంటంటే అతడు తన ఖాతాకు పెట్టిన పాస్‌వర్డ్ మర్చిపోయాడు. దీంతో అందులోంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేని దీన స్థితిలో పడిపోయాడు. ఎలాగైనా తన డబ్బును బయటకు తీసుకోవాలని అనుకున్నాడు. అయితే పాస్‌వర్డ్ తప్పుగా కొట్టడానికి వీలులేదు. అలా తప్పుడు పాస్‌వర్డ్‌తో 10సార్లకంటే ఎక్కువగా ప్రయత్నిస్తే శాశ్వతంగా ఖాతా బంద్ అయిపోతుంది. ఇప్పటికే థామస్ 8సార్లు పాస్‌వర్డ్ కొట్టేశాడు. ఇక మిగిలింది రెండు అవకాశాలు మాత్రమే. ఒకవేళ ఈ రెండు అవకాశాలు కూడా తప్పుగా కొట్టాడంటే అంతే తన కోట్ల సంపద పూర్తిగా ఆవిరైపోతుంది. చూశారా మతిమరుపు ఎంత పని చేసిందో. మీరు కూడా ఏదైనా విలువైన వస్తువును ఎక్కడైనా పెట్టే సమయంలో ఒకటికి వంద సార్లు గుర్తు పెట్టుకోండి. లేకపోతే మీరు నష్టపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: