ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ ఎవర్‌గ్రీన్ క్లాసిక్ మూవీ ‘దసరా బుల్లోడు’ కి నటుడు జగపతి బాబు తండ్రి వీ బీ రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాలో ముచ్చటించారు హీరో జగపతి బాబు. ఏఎన్నార్ కెరియర్‌లో ఫస్ట్ గోల్డెన్ జూబ్లీ జరుపుకుంది ‘దసరాబుల్లోడు’.సినిమా నిజంగానే మ్యాజిక్. నాన్న గారి డైరెక్షన్‌లో ఫస్ట్ మూవీ.ఆయన ప్రొడక్షన్‌లో జగపతి బ్యానర్ 1958‌లో స్టార్ట్ అయ్యింది. జగపతి అనేది తాతగారి పేరు.. లక్కీగా నాకు వచ్చింది.

ఆరోజుల్లో దసరాబుల్లోడు అంటే ట్రెండ్ సెట్టర్. 50 ఏళ్లైనా గుర్తుపెట్టుకున్నామంటే ఆ సినిమాని జనం ఎంతలా ఆదరించారో అర్థం చేసుకోవచ్చు. నాన్న గారి అభిమానుల కోసం ఆ మాటలు చెప్తున్నా.. నాన్నగారు అంటే దసరాబుల్లోడు అనేవారు. ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికీ నాకు ఆరేళ్లు.. మమ్మల్ని చూసి దసరాబుల్లోడు పిల్లలు వచ్చేశారు అనేవాళ్లు. దసరాబుల్లోడు కారు కూడా ఫేమస్ అయ్యింది.. ఆ కారు నేను కూడా నడిపా.నాగేశ్వరరావు గారి పెర్ఫామెన్స్ గురించి జనం ఇప్పటికీ చెప్పుకుంటారు.

నాన్న గారి దర్శకత్వం వహించిన ఫస్ట్ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడం గ్రేట్ నెస్. ఆరోజుల్లో ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరూ దొరకలేదు. దీంతో నాగేశ్వరరావు గారు నువ్వే చేసెయ్ అని అన్నారు. నాగేశ్వరరావు ఆ మాట అనగానే నాన్న గారు ధైర్యం చేసి డైరెక్ట్ చేశారు సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఏఎన్నార్ అంకుల్ ఆరోజు అలా అని ఉండకపోతే ఈ సినిమాని నాన్న గారు డైరెక్ట్ చేసేవారు కాదు’ అంటూ దసరాబుల్లోడు చిత్ర విశేషాలను పంచుకున్నారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...

మరింత సమాచారం తెలుసుకోండి: