కరోనా వైరస్‌ భయంతో ప్రయాణానికి భయపడిన ఓ భారతీయ అమెరికన్ చికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలోని నిషేధిత ప్రాంతంలో దాదాపు మూడు నెలలు ఉన్నాడు.. అతడు ఆలా ఉండడాన్ని పోలీస్ కూడా  సిబ్బంది గుర్తించలేకపోవడం విశేషం . గతేడాది అక్టోబరు 19న ఆదిత్య సింగ్‌ లాస్ ఏంజెల్స్ నుంచి చికాగో  విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఆ విమానాశ్రయంలోనే  మూడు నెలలు ఉన్నాడు .. ఇదిలా ఉండగా అతడిని మూడు రోజుల కిందట అమెరికా అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వాళ్ళు చికాగో ఓ హారే అంతర్జాతీయ విమానాశ్రయంలో చట్టవిరుద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే ఆదిత్య సింగ్ ‌పై విమానాశ్రయ నిషేధ ప్రాంతంలోకి ప్రవేశించడం, మరియు పోలీసులను తప్పుదోవపట్టించేలా ప్రయత్నించడం వంటి  నేరారోపణలు వేశారు.. ఎయిర్ పోర్ట్ లో అప్పటికే చాల రోజుల నుండి  తిరుగుతున్నా ఆదిత్య సింగ్‌పై అనుమానం రాగా ఎయిర్‌లైన్స్ సిబ్బంది అతడిని  ప్రశ్నించింది దాంతో వాళ్ళకి విషయం తెలియడంతో అధికారులు వెంటనే  911కి సమాచారం ఇచ్చారు.. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు...

మూడు నెలల క్రితం చికాగో ఎయిర్‌పోర్ట్ వచ్చి ఇక్కడే ఉండిపోయిన ఆదిత్య.. ఇక్కడ ఉంటె ఎవరికైనా అనుమానం వస్తుందని ఎయిర్ పోర్ట్ స్టాఫ్ ధరించే బ్యాడ్జ్‌ను సంపాదించి తిరిగాడు.. బ్యాడ్జ్ ధరించి తిరగడం వాళ్ళ  పోలీసులు అతన్ని గుర్తించలేకపోయారు. అయితే ఇదంతా విన్న న్యాయమూర్తి కూడా విస్మయం చెందారు. అయితే లాస్ ఏంజెల్స్‌ లో స్నేహితులతో కలిసి నివాసముండే  ఆదిత్య గతంలో ఎటువంటి క్రిమినల్ రికార్డు లేని కారణంగా బెయిల్ కోసం 1,000 డాలర్లు చెల్లించాలని కోర్ట్ తెలిపింది.. అయితే ఈ ఘటనపై  కేసు దర్యాప్తులో ఉన్నప్పటికీ.. ఆ వ్యక్తి విమానాశ్రయానికి మరియు ప్రజలకు ఎటువంటి ప్రమాదం కలిగించలేదని చికాగో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఏవియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.





మరింత సమాచారం తెలుసుకోండి: