ఒకప్పుడు వచ్చే యాడ్స్   మీకు గుర్తుండే ఉంటాయి .. నిర్మా డిటర్జెంట్ పౌడర్ నుంచి లైఫ్ బాయ్ సోప్ వరకు అప్పటి యాడ్స్   పాటలు ఎంతో ఫేమస్ అయ్యాయి. అప్పటి యాడ్లలో ఉన్న మ్యాజిక్ కూడా బాగా పాపులర్ అయ్యింది ..   అందుకే ఇప్పటికీ ఆ పాత యాడ్స్ యొక్క  పాటలు చాలా మందికి గుర్తుంటాయి. అప్పుడప్పుడూ హమ్ కూడా చేస్తుంటారు.. అయితే పాత యాడ్స్  లాగా ఇప్పుడు వచ్చే దాంట్లో మ్యూజిక్ సరిగా ఊడడం లేదని కొందరు అభిప్రాయం పడుతున్నారు .. ఎంతైనా ఓల్డ్ ఐస్ గోల్డ్ అన్నట్లు ఇప్పుడు వచ్చే కొత్త యాడ్స్ ని పాత  వాటితో అస్సలు పోల్చలేము.. అయితే  అప్పటి యాడ్ లను ఓ బ్యాండ్ అద్భుతంగా ఇప్పుడు పాడుతుందని.. అదీ ఓ రెస్టారెంట్ లో వాళ్ళు ఆలా పాడుతుంటే అక్కడ ఉన్నవారు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయి  ఆ యాడ్స్ ని గుర్తుచేసుకొని  ఎంజాయ్ చేయడం విశేషం.. ఇక వివరాలలోకి వెళ్తే ..  

కొన్ని పాత యాడ్స్  పాటలను ఓ బ్యాండ్ అద్భుతంగా ప్రదర్శించింది. రెస్టారెండ్ లో   వీళ్ళు పాడిన పాటలతో అక్కడ ఉన్న ప్రజలను ఊర్రూతలూగించింది. వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ ప్రారంభించిన మ్యూజిక్ బ్యాండ్  “పాన్ పరాగ్  పాన మసాలా”, “లైఫ్  బాయ్  హై జరాన్ తందోరుస్తి హై వహా” అంటూ సాగింది. మ్యాగీ, హమరా బజాజ్ ఇలా పాత యాడ్లను సింగర్లు అద్భుతంగా పాడారు . దీంతో డిన్నర్ కోసం రెస్టారెంట్ వచ్చిన వారంతా చప్పట్లు, కేరింతలతో హోరెత్తించారు .. వయసు మరిచి చిన్నపిల్లలా ఎంజాయ్ చేసారు . తమకెంతో ఇష్టమైన యాడ్ల పాటలను చాలారోజుల తర్వాత వినడంతో అందరు  సింగర్ తో పాటు గొంతు కలిపారు.

అయితే  వాళ్ళు ఆలా పాడుతుంటే   అక్కడి వారు ఒకరు  వీడియో తీసి నెట్ లో పెట్టారు.. దీంతో ఈ వీడియో కొన్ని నిమిషాలలోనే వైరల్ గా మారింది ... అంతేకాకుండా ఈ వీడియో కి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పాత యాడ్లను గుర్తు చేసిన ఆ రెస్టారెంట్ బ్యాండ్ ను ప్రశంసిస్తున్నారు. ఎంత మందికి ఈ యాడ్లు గుర్తున్నాయంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: