ఇంటర్నెట్ డెస్క్: నిండు నూరేళ్లు ఆయుష్షుతో ఆరోగ్యంగా జీవించడం ఎంతో గొప్ప విషయం పెద్దలు కూడా అందుకే పిల్లలను నిండు నూరేళ్లు జీవించు నాయనా.. నిండు నూరేళ్లూ జీవించు తల్లీ.. అంటూ దీర్ఘాయుష్షు కోసం దీవిస్తుంటారు. అయితే వారి ఆశీర్వాదాలు కూడా వందేళ్లు మించవు. కానీ కొందరు మాత్రం ఏకంగా 200 ఏళ్లు దాటేశారు. అలాంటి ఓ ఇద్దరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వారిలో ఒకరు చైనాకు చెందిన వ్యక్తి కాగా.. మరో వ్యక్తి భారతీయ స్వామీజీ. దాదాపు మూడు, నాలుగు వందల ఏళ్ల క్రితం వీరు జీవించారు.

చైనాలోని ఓ వ్యక్తి ఏకంగా 250 ఏళ్లు పైగా జీవించాడట. నమ్మడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమేనని కొన్ని ఆధారాలు కూడా దొరుకుతుండడం షాక్‌కు గురి చేస్తోంది. చైనాకు చెందిన లీ చిన్ యోన్ అనే వ్యక్తి ఏకంగా 256 ఏళ్లు బతికాడని, అతడు 1677లో జన్మించి, 1933 వరకు జన్మించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ఆధారాలూ లేవు. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ప్రచురితమైన ఓ కథనం ప్రకారం లీ చిన్ 1736లో పుట్టారు. అంటే ఆయన 197 ఏళ్లు జీవించాడని ఆ కథనం చెబుతోంది.

తాబేలులా కూర్చోవడం, పావురంలా నడవడం, కుక్కలా పడుకోవడం వంటి విధానాల వల్లనే ఆయన అంతకాలం జీవించాడని చెబుతుంటారు. ఆయన బతికున్నంత కాలం హృదయాన్ని నిర్మలంగా ఉంచుకునేవారని అది కూడా అతడి ఆయువును పెంచిందని చెబుతారు. అయితే ఆయన స్వతహాగా వైద్యుడు కావడం వల్ల ఎక్కువ కాలం జీవించేందుకు ఆయుర్వేద మూలికలు వాడారని, అందుకే ఆయన అంతకాలం జీవించారని కొన్ని కథనాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే భారత దేశానికి చెందిన త్రైలింగ స్వామి అనే భారతీయ స్వామీజీ కూడా ఏకంగా 280 ఏళ్లు జీవించి ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనను శివ స్వరూపంగా శిష్యులు భావించేవారు. అయితే త్రైలింగ స్వామి ఎప్పుడు జన్మించారనే దానిపై అనేక వాదనలున్నాయి. ఆయన శిష్యులు కొందరు త్రైలింగస్వామి జీవితం గురించి పుస్తకాలు రాశారు. అందులో స్వామీజీ జన్మించిన తేదీ గురించి ఒక్కొక్కరు ఒక్కో ఏడాదిని పేర్కొన్నారు.

శివరామ అనే శిష్యుడు రాసిన పుస్తకంలో.. త్రైలింగస్వామి 1529లో జన్మించారని చెప్పగా.. మరో శిష్యుడు ఆయన 1607లో జన్మించినట్లు పేర్కొన్నారు. ఆయన మరణించిన తేదీ మాత్రం 1887లో మరణించినట్లు తెలుస్తోంది. అంటే మొత్తం 280 ఏళ్లన్నమాట. ఆయన 1737 నుంచి 1887 వరకు వారాణసిలో జీవించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: