సాధారణంగా ఒక సారి గర్భం దాల్చిన మహిళలు తొమ్మిది మాసాల పాటు బిడ్డను మోసి కన్న తరువాత మరోసారి గర్భందాల్చడం మనము చూస్తున్నాము. అయితే కడుపులో బిడ్డ ఉండగానే మళ్లీ గర్భం దాల్చడం గురించి ఎప్పుడైనా విన్నారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కొంత మందిలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ కి చెందిన ఓ యువతి విషయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...                                                   

ఇంగ్లాండ్‌లోని ట్రౌబ్రిడ్జ్‌లో నివశిస్తున్న రెబక్కా రోబెర్ట్స్ అనే 39 ఏళ్ల మహిళ గర్భం దాల్చి తన కడుపులో బిడ్డ ఉండగానే మరోసారి గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే గర్భందాల్చిన కొద్దిరోజుల తరువాత తర్వాత సదరు మహిళ స్కానింగ్ చేయించుకున్నప్పుడు డాక్టర్లు ఒకే బిడ్డ ఉందని చెప్పారు. అయితే మరి కొన్ని వారాల తరువాత మరొక బిడ్డ ఎదుగుతుందని చెప్పడంతో ఆ మహిళ కొంతవరకు ఆశ్చర్యపోయింది. అయితే ఈ విధంగా కడుపులో బిడ్డ ఉండగానే మరోసారి గర్భందాల్చడాన్ని "డబుల్ ప్రెగ్నెన్సీ" అంటారు. తన గర్భం దాల్చడం కోసం వాడిన మందుల కారణంగా ఈ విధంగా మరొకసారి అందం లేటుగా విడుదలయ్యి ఫలదీకరణ జరిగిందని డాక్టర్లు తెలియజేశారు.

రెబక్కా సెప్టెంబర్ నెలలో కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఇద్దరిలో మగ బిడ్డ 4.10కి .లో బరువు ఉండగా ఆడశిశువు 2.7  కి.లో బరువు ఉంది. ఈ నేపథ్యంలోనే అమ్మాయి బరువు పెరుగుదల కోసం మూడు నెలల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు తెలియజేయడంతో ఆడశిశువును మూడు నెలల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం ఆ బిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో డిసెంబర్ 25 న ఆ చిన్నారిని డిశ్చార్జ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: