ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో చేతిలో మొబైల్ లేకుండా, అందులో వాట్సాప్ లేకుండా ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ప్రతి రోజూ లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు వాట్సాప్‌లో స్నేహితులందరినీ పలుకరిస్తూ.. వందల సందేశాలు షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరికీ ఇంత దగ్గరైపోయిన వాట్సాప్ త్వరలో మన ఖాతాలన్నింటినీ పర్మినెంట్‌గా డిలీట్ చేయబోతోంది. దీంతో కోట్ల మంది ఖాతాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయడం.

సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ తమ ప్రైవసీ పాలసీని అప్‌డేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కొత్త నిబంధనలను ఈ నెల 8వ తేదీ నుంచే అమలులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నించింది. అయితే కేంద్ర ప్రభుత్వం అడ్డుపడడం, కోర్టు తల దూర్చడంతో కొంత వెనక్కి తగ్గింది. కానీ న్యాయస్థానంలో విచారణ కొనసాగుతుండగానే.. వాట్సాప్ తన కొత్త పాలసీని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. మార్చి 15 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలవుతాయని వాట్సాప్ మాతృసంస్థ ఫేస్‌బుక్ చెబుతోంది.
       
కొత్త ప్రైవసీ పాలసీనియాక్సెప్ట్ చేయని యూజర్ల ఖాతాలను పనిచేయకుండా చేయనున్నట్లు తెలుస్తోంది. అంటే నోటిఫికేషన్లు, ఇన్‌కమింగ్ మెసేజ్‌లూ వస్తాయి. కానీ అవుట్ గోయింగ్ మెసేజ్‌లు పంపేందుకు అవకాశం ఉండదని సమాచారం. అది కూడా 120 రోజుల వరకు ఇలా కొనసాగుతుందని, ఆ తర్వాత పూర్తిగా ఖాతానే డిలీట్ చేసేస్తారని తెలుస్తోంది. అయితే కొత్త నిబంధనలను యాక్సెప్ట్ చేసిన యూజర్స్‌కు మాత్రం వాట్సాప్ సేవలు పూర్తిగా అందుబాటులో ఉంటాయట.

దీనిని నుంచి తప్పించుకోవాలంటే రెండే మార్గాలున్నాయి. అవేటంటే.. వాట్సాప్ పాలసీని యాక్సెప్ట్ చేయడం లేదా వాట్సాప్ ఖాతా డేటాను డౌన్‌లోడ్ చేసుకుని టెలిగ్రాం వంటి వేరే మెసేజింగ్ యాప్‌కు మారిపోవడం. మరి మీ డెసిషన్ ఎలా ఉంటుందో అలా చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: