లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలకు చేరువలో ఉంటే ఒక రూపాయి ఇస్తారా..?  దాదాపుగా  పెట్రోల్ ను ఉత్పత్తి చేస్తున్న సంస్థలు కూడా ఒక రూపాయికి ఇవ్వలేవు..! మరి ఇదెక్కడి విడ్డూరం అని ఆలోచిస్తున్నారా ..? ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతి ఒక్కరి దగ్గర బైకు ఉండనే ఉంటుంది. అందులో పెట్రోల్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇప్పుడు ఇక మన దేశంలో అయితే పెట్రోల్ దాదాపు వంద రూపాయలకు చేరువలో ఉంది. కానీ ఇతర దేశాలలో పెట్రోల్ చాలా తక్కువగానే ఉందట. కరోనా కు ముందు వరకు 75 రూపాయలు ఉండగా. ఇప్పుడు దాదాపు వంద వరకు చేరువలో ఉంది.


కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల వల్ల పెట్రోల్ ధరలు చాలా పెరగాయని  కొంతమంది అంటుంటారు. అదేవిధంగా  ఏ ఏ దేశాల్లో లీటర్  పెట్రోల్ ధర ఎంతేంత వుందో ఇప్పుడు  ఇక్కడ చదివి తెలుసుకుందాం.

 దేశాలవారీగా పెట్రోల్ ధరలు లీటరు ఇలా ఉన్నాయి :

1. వెనెజ్వెలా - 0.020 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం  రూ.1.45.

2. ఇరాన్ - 0.062 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం  రూ.4.50.

3. అంగోలా - 0.245 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం  రూ.17.78.

4. అల్జీరియా - 0.346 డాలర్లు అనగా భారత కరెన్సీ ప్రకారం  రూ. 25.10.

5. కువైట్- 0.347 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం  రూ. 25.18.

6. సుడాన్ - 0.379 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం  రూ. 27.50.

7. కజక్‌స్థాన్ - 0.408 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం  రూ. 29.60.

8. ఖతార్ -0.412 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం  రూ. 29.89.

9. తుర్కమెనిస్తాన్ - 0.428 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.31.05.

10. నైజీరియా - 0.435 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ . 31.65.

11. ఈక్వెడార్ - 0.464 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ . 33.66.

12. కిరిజిస్థాన్ -0.472 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం  రూ.34.34.

13. మలేసియా - 0.486 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.35.26.

14. యూఏఈ - 0.490 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.35.55.

15. ఇరాక్ - 0.515 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ. 37.36.

16. సౌదీ అరేబియా - 0.517 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ. 37.51.

17. ఒమన్ - 0.525 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.38.09.

18. బహ్రెయిన్ - 0.530 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ .38.45.

19. ఇథియోపియా - 0.537 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ .38.96.

20. బొలీవియా -0.542 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ .39.32. గా లీటర్ పెట్రోల్ ధర పలుకుతోంది. కానీ అన్ని సుంకం లను కలుపుకొని భారతదేశంలోని మనకు చేరేసరికి లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: