సాధారణంగా మనస్సులో అనేక జీవరాసులు చూసి ఉంటాం. కొన్ని జీవాలు చిత్ర విచిత్రంగా జన్మిస్తాయి. ఈ ప్రపంచంలో చాలా జీవుల్లో మార్పులు వస్తుంటాయి. ఇందులో కొన్ని ప్రకృతి సిద్ధంగా వచ్చే మార్పులు. మరి కొన్ని జన్యు పరమైన సమస్యలతో వచ్చే మార్పులు. సహజంగా మనం ఇంటివద్ద పెంపుడు జంతువులు కుక్క పిల్ల అని పెంచుతూ ఉంటాం. కుక్కల నాలుగు కాళ్లతో జన్మించడం సహజం. కానీ అమెరికాకు చెందిన ఒక కుక్క పిల్ల మాత్రం ఆరు కాళ్ళతో రెండు తోకల తో జన్మించింది. ఈ కుక్క పిల్ల విషయం గురించి మనం తెలుసుకుందాం.


 మామూలుగా కుక్కలకు నాలుగు కాళ్లు ఒక తోక ఉంటాయి. కానీ ఈ కుక్క పిల్ల మాత్రం ఆరు కాళ్లు రెండు తోకలతో జన్మించింది. వినడానికి వింతగా ఉన్నా ఈ ఘటన అమెరికాలోని ఓక్లహూమాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం కుక్కపిల్ల ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే ఈ ఆడ కుక్క పిల్ల ఓక్లహూమాలోని నీల్ వెటర్నరీ ఆస్పత్రిలో గత వారం జన్మించింది. ఆరు కాళ్ళు రెండు తోకల తో జన్మించిన ఈ కుక్క పిల్ల ఫోటోలు ను  ఆసుపత్రి వర్గాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయి


 సాధారణంగా వింతగా జన్మించిన కుక్క పిల్లలు అనారోగ్యానికి గురయ్యేవని వారు అన్నారు. తాను ఇలాంటి వింత కుక్కను గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆ కుక్కపిల్ల చాలా ఆరోగ్యంగా ఉందని ఇతర కుక్క పిల్లల మాదిరిగానే బరువు కూడా పెరుగుతుందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అయితే గర్భాశయంలో ఉన్నప్పుడు పిండాలు వేరు కాకపోవడంతో ఇలా జరిగిందని వైద్యులు భావిస్తున్నారు .


 పిండాలు వేరు అయి ఉంటే ఇంకో కుక్కపిల్ల జన్మించే ఉండదని వారు అంటున్నారు. అలా జరగకపోవడం వల్ల కుక్కపిల్లకు అదనపు అవయవాలతో జన్మించిందని అన్నారు. అయితే కుక్కపిల్లకు ఫిజికల్ థెరపీ, శస్త్ర చికిత్సలు అవసరమని కొంత వయసు పెరిగిన తర్వాత సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఒక పిల్ల మోనోసేపాలాస్ డిపైగస్ మరియు మోనోసెపాలస్ రాచిపగస్ డైబ్రాచియస్ టెట్రాపర్స్ అని పిలువబడే పుట్టుకతో వచ్చే రుగ్మతలు కలిగి ఉందని చెప్పారు. అంతే కుక్కపిల్లకు ఒక తల ఒక ఛాతి ముక్కు ఉండి రెండు పాయల రంధ్రాలు రెండు ప్రత్యుత్పత్తి వ్యవస్థలు రెండు మూత్ర  మార్గాలు ఉన్నాయని అర్థమని వారు వివరించారు. ఇక ఈ కుక్కపిల్ల కు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి: