సాధారణంగా మనం దీపావళి పండుగ వచ్చిందంటే చాలు టపాసులు కలుస్తాం. కానీ ఇప్పుడున్న జనరేషన్లో పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు టపాసులు పిలుస్తున్నారు. ఇలా టపాసులు పేల్చినప్పుడు కుక్కలు గేదెలు లాంటివి భయ పడుతుంటాయి. టపాసులు కలుస్తున్నప్పుడు గోడ రంద్రంలో కుక్క తల చిక్కుకుపోయింది. దీని గురించి విషయాలు తెలుసుకుందాం.


 పండగలు శుభకార్యాలు వచ్చాయంటే చాలు టపాసులు కాల్చడం అంతా సహజంగా జరిగేది. వీటి నుంచి వచ్చే పొగ అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది అని తెలిసినా సరే, అక్క వారితో పోల్చుకుంటు మరి టపాసులు పేలుస్తుంటాం. అయితే మన ఆనందం కోసం పక్క వారిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని గుర్తించాలి. టపాసుల నుంచి వచ్చే శబ్దం పెంపుడు జంతువులను భయబ్రాంతులకు గురి చేస్తుంది. అనేక సందర్భాల్లో టపాసుల వల్ల జంతువులకు వినికిడి లోపం కూడా వస్తుంది. ఇటీవల చైనా లో కూడా ఇటువంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. చైనా ప్రజలు వేట ప్రపంచానికి విభిన్నంగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటారు.


 వారి క్యాలెండర్ వేరుగా ఉండడమే దీనికి కారణం. ఈసారి కూడా ఫిబ్రవరి 13న లూనార్ న్యూ ఇయర్ వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగానే యాంచెంగ్ లోని ఒక అపార్ట్మెంట్ లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ వాసులు పెద్ద ఎత్తున టపాసులు పేల్చి వేడుకలు నిర్వహిస్తుండగా, శబ్దంతో భయానికి లోనైన ఒక కుక్క వారి నుండి తప్పించుకునేందుకు గోడ వెనుక దాక్కుంది. అయితే ఆ గోడకు చిన్న రంధ్రం ఉండటంతో అందులో చిక్కుకు పోయింది. దానివలన ఆర్య టు కదలలేని స్థితిలోకి వెళ్లిపోయింది. దీన్ని గమనించిన అపార్ట్మెంట్ వాసులు దాని రక్షించేందుకు పోలీసులకు సమాచారం ఇచ్చారు.


 రంగంలోకి దిగిన పోలీసులు సురక్షితంగా కుక్కను బయటికి తీశారు. పోలీసులు కుక్కను రక్షిస్తున్న సందర్భంలో తీసిన  చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గోడ రంధ్రంలో ఇరుక్కుపోయిన  కుక్కను బయటికి తీయడానికి  రెస్క్యూ టీం సుత్తి ఉపయోగించారు. ఎటువంటి గాయాలు లేకుండా సుత్తితో  ఒక పోలీసు అధికారి గోడను పగలగొట్టారు. దీంతో ఆ కుక్క సురక్షితంగా బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: