పౌరాణిక చిత్రాలలో నటించాలంటే అది కేవలం నందమూరి కుటుంబానికి మాత్రమే సాధ్యమవుతుందని స్వర్గీయ తారక రామారావు నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు నిరూపించుకున్నారు. తారక రామారావుతో పాటు బాలకృష్ణ కూడా పలు పౌరాణిక చిత్రాలలో నటించి తన అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అయితే బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ చిత్రం కోసం బాలకృష్ణ భీష్ముడి పాత్ర ధరించి అద్భుతమైన సన్నివేశాలను తెరకెక్కించారు. అయితే ఈ సన్నివేశాలు ఎక్కువ నిడివి ఉండటం కారణంగా ఆ సన్నివేశాలను సినిమాలలో తొలగించారు.                                                                                                         

అయితే భీష్మఏకాదశి సందర్భంగా బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో భీష్ముని గెటప్ వేసిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ...."భీష్మ పాత్రంటే నాకెంతో ఇష్టం. నాన్న గారు, ఆయన వయసుకి మించిన భీష్మ పాత్ర పోషించి ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలను అందుకున్నారు. ఆ చిత్రం, అందులోని నాన్నగారు నటించిన భీష్ముని పాత్ర అంటే నాకెంతో ఇష్టం."అంటూ ఈ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ ధరించిన భీష్ముడి గెటప్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఎంతోమంది నందమూరి అభిమానులను ఆకట్టుకుంది. ఈ విధంగా నటసింహం బాలకృష్ణ భీష్ముని గెటప్ లో చూసిన నందమూరి అభిమానులు బాలకృష్ణ ఫోటోకి ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: