ప్రస్తుత కాలంలో వంటింట్లో అడుగు పెట్టాలంటే ఎవరికైనా బద్ధకమే. ప్రస్తుతం ఎన్నో ఫుడ్ డెలివరీ వెబ్సైట్ వచ్చిన తర్వాత  చాలామంది వంటింట్లోకి అడుగు పెట్టాలంటే ఇబ్బంది పడుతున్నారు. చిటికెలో ఆర్డర్ చేస్తే, నిమిషంలో ఫుడ్ డెలివరీ అవుతుంది.. ఇన్ని ఫెసిలిటీస్  ఉన్నప్పుడు మరి ఇంకెవరు కిచెన్ లోకి అడుగు పెడతారు.. పూర్వకాలంలో వంట చేయడం అనేది ఒక కళ. కానీ ప్రస్తుతం ఎన్నో వెబ్సైట్లు వంటలు ఎలా చేయాలో చూపిస్తున్నాయి. కాబట్టి ఇట్టే వంట చేస్తున్నారు.. వంట  రాని వారు సైతం.. ప్రస్తుత కాలంలో అమ్మాయిలు మరీ బద్ధకంగా తయారయ్యారు.. వంట చేయడానికి ఆల్మోస్ట్  ఇంట్రెస్ట్  చూపించడం లేదు.


కానీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచేలా ఒక 9 ఏళ్ల బాలుడు కేవలం 60 అంటే 60 నిమిషాల్లోనే 150కిపైగా వంటకాలు చేసి, అందరిని అబ్బుర పరుస్తున్నాడు. కేరళకు చెందిన తొమ్మిదేళ్ల హయాన్ అబ్దుల్లా కేవలం గంటలో 150కిపైగా వంటకాలు చేసి రికార్డు సృష్టించాడు. మొన్నటివరకూ తమిళనాడు రాష్ట్రం, చెన్నైకు చెందిన ఎస్.ఎన్.లక్ష్మీ సాయి శ్రీ  కేవలం 58 నిమిషాలలో 46 రకాల వంటలు వండి,యూనిక్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కెక్కింది. ఈ రికార్డును బద్దలుకొట్టి, మరెవరు ఈ రికార్డును సాధించలేనంతగా అబ్దుల్ హయాన్ కేవలం 60 నిమిషాలలో 150కి పైగా వంటలు చేసి, "ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్" లో చోటు సంపాదించుకున్నాడు..


ఇక తను చేసే వంటలలో బిర్యానీలు,  పాన్ కేకులు, సలాడ్లు, మిల్క్ షేక్స్, చాక్లెట్ వంటలను కేవలం 60 నిమిషాల్లోనే వండడం ద్వారా ఈ రికార్డు దక్కింది.. ఇక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అబ్దుల్ హయాన్ మాట్లాడుతూ.. " నాకు వంట చేయాలి అంటే చాలా ఇష్టం.  నాలుగేళ్లు ఉన్నప్పుడే కుకింగ్ ఒక అలవాటుగా మారిపోయింది. వంట చేయాలి అన్న ఆసక్తి తోనే కిచెన్ లోకి వెళ్లేవాడిని.. " అంటూ చెప్పుకొచ్చాడు.. ఇక ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తన తల్లి రశా అబ్దుల్లా మాట్లాడుతూ.. " హయాన్ కు వంట చేయాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండడంతో అది చూసి,  నేను తన నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పటినుంచి నేర్పించడానికి ప్రయత్నం చేశాను.. ఇక ఆ ప్రయత్నమే ఈ రోజు నా కొడుకును గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించేలా చేసింది.. హయాన్ నా కొడుకు అయినందుకు నాకు గర్వంగా ఉంది.. "అంటూ ఆమె చెప్పొకొచ్చింది.


 హయాన్ ప్రస్తుతం చెన్నైలోని షేర్ వుడ్ హాల్ సీనియర్ సెకండరీ స్కూల్లో మూడవ తరగతి చదువుతున్నాడు. ఇతనికి సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. "హయాన్ డెలికసీ " పేరుతో ఉన్న చానల్లో అనేక రకాల వంటలను ఎలా చేయాలో ఇంగ్లీష్, మలయాళం, తమిళ భాషల్లో వివరంగా చూపిస్తూ ఉంటాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: