ప్రతి ఒక్కరూ బాగా చదివి జీవితంలో స్థిరపడాలని కష్టపడితే చదువుతారు. చదువు అయిపోయినా అనంతరం ఉద్యోగం కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఉద్యోగ  వేట అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక జాబ్ కోసం వందల మంది పోటీపడే రోజులివి. అందువల్ల ఇద్దరు చేసే వారిని అప్లై చేయడానికి ఎన్నో విధాలుగా ఎన్నో ఎత్తులు వేస్తుంటారు.  అలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఇది కడుపు లోకి వెళ్లి రెస్యూమే దీనికి సంబంధించిన ఐడియా వైరల్ అవుతోంది. దీనిని  చూసిన నేటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.



 ఇప్పుడున్న జనరేషన్లో ఒక జాబ్ తెచ్చుకోవడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక పోస్టు ఉన్నా వాటికి వందలమంది అప్లై చేసుకుంటారు.  అలాంటి రోజులు ఇవి అయితే మనం ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు అక్కడ మన రెస్యూమ్ ను చూసి మనం ఆ జాబ్ కి ఎలిజిబుల్ అయితే ఉద్యోగం ఇస్తారు. సత్య ఉద్యోగం సాధించాలంటే మొదటగా రెజ్యూమె కీలక పాత్ర వహిస్తుంది. కొందరు ఉద్యోగానికి  వెళ్లినప్పుడు తమలో ఉన్న టాలెంట్ తో ఆకట్టుకుంటే, మరి కొందరు వారి మాటలతో ఆకట్టుకునేలా సాధిస్తారు. ఈ ప్రక్రియలో ఉద్యోగానికి తొలిమెట్టుగా నిలిచే రెస్యూమ్ ఆసక్తికరంగా తీర్చిదిద్దేందుకు అంతా కుస్తీ పడుతుంటారు.


 అయితే ఒక అభ్యర్థి మాత్రం జాబ్ కొట్టేందుకు వినూత్న పంథాను ఎంచుకున్నాడు. తన రెస్యూమ్ను ఒక డొనట్ బాక్స్ లో పెట్టి పంపించాడు. దానిద్వారా ఇంటర్వ్యూ చేసే వారిని అట్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించారడు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా లో ప్లాట్ ఫామ్ రెడిట్ లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పోస్టు ను పరిశీలించగా నాలుగో డోనట్స్ తో కూడిన ఒక బాక్స్ లో అతని రెజ్యూమెను చూడవచ్చు. అయితే రెస్యూమ్ తో పాటు అందులో ఒక సందేశాన్ని కూడా జత చేశాడు.


 చాలామంది రెస్యూమ్లు చివరికి చేరేది చెత్త బుట్ట కి కానీ నా రెజ్యూమె మాత్రం చివరికి మీ పొట్టలోకి చేరుతుంది అంటూ కామెంట్ చేశాడు. ఫిబ్రవరి 21న సోషల్ మీడియాలో దీన్ని పోస్ట్ చేయగా ఇది నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. దీనికి 65,700 లైకులు, వేల కొద్దీ కామెంట్లు వచ్చిపడుతున్నాయి. అయితే నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు అతడు తెలివైన పని చేశాడని కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్రం ఇలా చేయడం వల్ల జాబ్ రాదని టాలెంట్ తో  జాబ్ కొట్టాలి అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ రెసుమె వైరల్ అయిన తర్వాత చాలా సంస్థలు అతనిని ఇంటర్వ్యూ కి పిలిచారట. అందులో ఏ సంస్థ టాలెంట్కి తగ్గ జీతం ఇస్తే అందులో చేరతాను అంటున్నాడు ఆ వ్యక్తి.

మరింత సమాచారం తెలుసుకోండి: