సామాన్యుడిపై మరోసారి పాల ధరల రూపంలో మరో పిడుగు పడబోతోంది.. ఇప్పటికే నిత్య అవసరంగా ఉపయోగిస్తున్న గ్యాస్ పై ధరలు పెంచి సామాన్యుడి గుండె ను గుభేల్ చేసింది ప్రభుత్వం.. ఇలా ఎప్పటికప్పుడు నిత్యావసర సరుకుల పై ధరలు పెంచుతూ సామాన్యుడికి అందని ద్రాక్ష పండు వలే చేస్తోంది ప్రభుత్వం.. అంతేకాకుండా కూరగాయల పైన కూడా రేట్లు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. ఇక పాల పై కూడా  ఈ ధరలను పెంచాలని పాల సంఘం అభ్యర్థులు నిర్ణయం తీసుకోబోతున్నారు అని సమాచారం.

ఇప్పటికే నిత్యావసర సరుకులు పెరిగిపోయి,సామాన్యుడు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుంటే, ఇప్పుడు మరోసారి పాలపై ఏకంగా 12 రూపాయలు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  పోయిన సంవత్సరం పాల ఉత్పత్తి దారులు చేసిన డిమాండ్ కు అప్పట్లో ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు పాల సంఘాలు. కానీ కరోనా తర్వాత ఇప్పుడు ఈ సంఘాలన్నీ ఒకరోజు సమావేశమయ్యాయి. ఇక ఈ తర్వాత వీరు లీటర్ పాలపై 12 రూపాయలు పెంచాలని నిర్ణయించుకున్నాయి.

ఈ మేరకు అధికారుల అనుమతితో వచ్చే నెల ఒకటో తారీకు నుంచి ఈ ధరలను పెంచాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే లీటరు పాల ధర గరిష్టంగా 43 రూపాయలు ఉండగా, ఇప్పుడు మరోసారి లీటరు పాల పై 12 రూపాయలను పెంచితే, అది లీటరు పాల ధర 55 రూపాయలకు పెరగనుంది.


ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో  పాల రవాణాకు అధిక ఖర్చు అవుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే పాల ధరలను కూడా పెంచాలని నిర్ణయానికి వచ్చినట్టు అక్కడి ఉత్పత్తిదారుల అసోసియేషన్ ప్రకటించింది.  ఏది ఏమైనా సామాన్యుడు తలపై ఒక పిడుగు పడినట్టు తెలుస్తోంది. కరోనా కాలంలో ఉద్యోగాలు లేక విలవిలలాడుతున్న సమయంలో ఇలాంటి నిత్యావసరాల ధరల పెంపు సామాన్యుడిపై తీవ్ర భారం  పడుతోందని  చెప్పవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: