సాధారణంగా మనం పల్లెటూర్లలో గొర్రెలు,మేకలు, పొట్టేలు చూస్తూ ఉంటాం. వీటిని ఆరుబయట పెంచుతుంటారు   లేదా షెడ్డు వేసి పెంచుకుంటారు. గొర్రెల పెంపకంలో రైతులు కొద్దిపాటి పెట్టుబడి తో సన్నకారు రైతులు భూమి లేని వ్యవసాయ కూలీలకు గొర్రెల పెంపకం లాభదాయకంగా ఉంటుంది. గొర్రెలు పర్యావరణానికి  తేలికగా అలవాటు పడి పోతాయి.                

 గొర్రెల మాంసం మార్కెట్లో రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది. అలాగే గొర్రె ఉన్ని కూడా మార్కెట్లో లభిస్తుంది. గొర్రె ఒక్కింటికి  ఒకటి నుంచి రెండు గొర్రె పిల్లలు తీరుతుంది. ఈ గొర్రెల్లో చాలా రకాల కూరలు ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి రకరకాలు ఉన్నాయి. ఈ గొర్రెల వల్ల ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తోంది. కానీ గొర్రెలు సహజంగానే ఉంటాయి. కానీ ఇప్పుడు చూస్తున్న ఈ  గొర్రె  మాత్రం ఇంటర్నెట్ని షేక్ చేస్తోంది. ఇంతకీ ఆ గొర్రె లో ఉన్న స్పెషల్ ఏంటో తెలుసుకుందాం.


 ఈ గొర్రె గొంగలి కప్పుకున్న గొర్రె కాదు. ఐదేళ్లుగా సేవింగ్ చేయని గొర్రె. ఈమధ్య ఆస్ట్రేలియాలోని అడవుల్లో కనిపించింది. కళ్ళ మీద కూడా ఉన్ని వచ్చేసి దారి సరిగ్గా కనపడక ఎంత భారాన్ని మోయలేక నీరసించిన ఈ గొర్రెను లక్కీగా కొందరు పర్యాటకులు చూసి అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఈ గొర్రెను చూసి ఆశ్చర్యపోయారు.


 మామూలుగా గొర్రెలకు ఉన్ని తీయడానికి కొన్ని నిమిషాల టైం పడితే దీనికి మాత్రం గంట సమయం పట్టిందట. అది 35 కిలోల బరువు ఉంది. ఇది ఒకప్పుడు ఏదో గొర్రెల ఫాంలో లో ఉన్నది అని తప్పిపోయి అడవికి చేరి  ఉంటుందని చెబుతున్నారు. కొన్ని రోజులుగా ఇలాగే ఉండి ఉంటే నీరసం వచ్చి చచ్చిపోయి ఉండేదట . మొత్తంమీద గ్రహాంతర జీవిలా కనిపిస్తున్న ఈ గొర్రె ఇంటర్నెట్ ను షేఖ్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: