ఇంటర్నెట్ డెస్క్: అంతరిక్షంలో మనిషికి తెలియని ఎన్నో రహస్యాలున్నాయి. ఆ రహస్యాలను తెలుసుకోవడానికి ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నారు. వాటిలో ఒకటి అంగారకుడు. మార్స్‌పై జీవ మనుగడకు సంబంధించిన రహస్యాలను తెలుసుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా అంగారకుడిపై జీవ మనుగడ కూడా సాధ్యమేనని శాస్త్రవేత్తలు గుర్తించారు.

భూమిపై జీవించినట్టే మార్స్ గ్రహంపై కూడా మనుషులు మనుగడ సాగించగలరని సరికొత్త అధ్యయనం ద్వారా తెలుసుకున్నారు. అంగారకుడిపై ఉండే వాతావరణం దాదాపు భూమిపై ఉండే వాతావరణంలానే ఉంటుందని, కొద్ది మార్పులు మాత్రమే ఉంటాయని వారంటున్నారు. వాతావరణం చల్లగానూ, పొడిగానూ ఉంటుందని, ఉపరితలంపై అతినీలలోహిత కాంతిని ప్రసరిస్తుంటుందని చెబుతున్నారు.

‘మార్స్‌పై వాతావరణం భూ వాతావరణానికి దగ్గరగా ఉంటుంది. అయితే అక్కడ జీవం ఉందో లేదో మిస్టరీగానే ఉంది. రెడ్ ప్లానెట్‌పై ఒకప్పుడు జీవం ఉండేదని ఇప్పటికే అనేకమంది శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనాల ద్వారా వెల్లడవుతోంది. భూమిపై జీవించే జీవులు అంగారకుడిపై తాత్కాలికంగా మనుగడ సాగించగలవని అంచనా. దీనికోసం పరిశోధనకులు ఓ వినూత్న ప్రయోగాన్ని కూడా చేశారు.

ఒక బెలూన్ లో బ్యాక్టీరియా, ఫంగీలను స్ట్రాటో ఆవరణంలోకి పంపినపుడు అక్కడి ప్రాంతంలో మార్టియన్ అంగారకుడి వాతావరణ పరిస్థితులను కల్పించి పరిక్షించారు. అలాగే సూర్యుని నుంచి యూవీ రేడియేషన్ ప్రతిబింబించేలా చూశారు. ఇందులో అన్ని సూక్ష్మజీవులు తట్టుకోలేకపోయాయి. కానీ వాటిలో కొన్ని బాక్టీరియాలు అతినీలలోహిత కాంతిని తట్టుకుని జీవించాయి. రెడ్ ప్లానెట్‌లో మనుగడ సాధ్యమే అనడానికి దీనిని ప్రత్యక్ష ఉదాహరణగా పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే అంగారకుడి మట్టిపై సూక్ష్మ జీవులు కూడా మనుగడ సాగించగలుగుతాయని కొందరు శాస్రవేత్తలు గుర్తించారు. మార్టిన్ అనే శాస్త్రవేత్త ఉల్క నుంచి పొందిన మట్టిపై సూక్ష్మజీవులను పెంచారు. ఈ బృందం ఉల్క నార్త్‌వెస్ట్ ఆఫ్రికా(ఎన్‌‌డబ్ల్యూఏ) 7034ను ఉపయోగించింది. ఈ ఉల్క 4.5 బిలియన్ ఏళ్ల నాటి అంగారక గ్రహానికి చెందినదిగా తెలుస్తోంది. రెడ్ ప్లానెట్‌పై ప్రారంభ ఏళ్లలో కెమోలిథోట్రోఫ్స్‌తో సమానమైన జీవం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ కెమోలిథోట్రోఫ్‌లు ఇనుము, మాంగనీస్ అల్యూమినియం ఫాస్ఫేట్‌లతో తయారైన ఖనిజ గుళికలు ఉన్నాయని వారు గుర్తించారు.

తాజాగా అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా).. పర్సీవెన్స్ అనే రోవర్‌ను అంగారకుడిపై దింపింది. దీని ద్వారా కూడా మార్స్‌కు సంబంధించిన కొత్త విషయాలను తెలుసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: