మన ప్రతి ఒక్కరి డైలీ ఆహార పదార్థాలలో బియ్యం కూడా ఒకటీ.  రైస్ వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి. అలాగని ప్రతిరోజు భుజించడం వల్ల అనేక నష్టాలు  ఉన్నాయి. కొంతమంది రైస్ ను ఎక్కువగా తింటే షుగర్ ఎక్కువ అవుతుందని అంటుంటారు. అయితే రైస్ తింటే షుగర్ వస్తుందనేది అపోహ మాత్రమే.. ఇదిలా ఉండగా మనము పండించే పదార్థాలలో కూడా నకిలీ ఆహార పదార్థాలు కూడా చాలానే వచ్చాయి. అందులో మనం ప్రతిరోజు తినే పదార్థాల్లో బియ్యం ఒకటి. ప్రస్తుతం బియ్యం కూడా ప్లాస్టిక్ రూపంలో రావడం కలకలం రేపుతోంది. అది ఎక్కడో..?  ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపుతోంది . పూలాజీ బాబా ఆశ్రమం వద్ద అన్నదాన కార్యక్రమం లో ప్లాస్టిక్ బియ్యం రావడం అందర్నీ కలవరపరిచింది. అన్నం పూర్తిగా మారిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అక్కడకు వచ్చిన ఆ స్థానికులు ఆ బియ్యాన్ని  పరిశీలించగా అవి ప్లాస్టిక్ బియ్యం అని అనుమానం వ్యక్తం చేశారు. అప్పటికే కొంతమంది  భోజనం చేయడంతో వారు ఆందోళనకు గురయ్యారు.


ప్లాస్టిక్ రైస్ తినడం వల్ల తమకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయోమో అని కలవరం వారిలో కనిపించింది. ఇలాంటి ప్లాస్టిక్ రైస్ అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ప్లాస్టిక్ బియ్యం బయటపడటం  ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా అనేకసార్లు ప్లాస్టిక్ బియ్యం బాగోతం వెలుగుచూసింది. ఇలాంటి ప్లాస్టిక్ రైస్  చైనా లో పుట్టుకొచ్చింది.


అయితే ఇవి నిజంగా ప్లాస్టిక్ రైస్ యేనా..  అందులో ఎంతవరకూ నిజం దాగి వుంది అన్న దానిపై అధికారులు అనేకసార్లు పరీక్షించారు.  ప్లాస్టిక్ బియ్యం అని ఎక్కడ బయటపడినప్పటికీ,  పాడైపోయిన బియ్యాన్ని పాలిష్ చేసి అమ్ముతున్నారని ఓసారి గుర్తించారు అధికారులు. ఆదిలాబాద్ లోని ఇటీవల రేషన్ సరుకులలో ప్లాస్టిక్ బియ్యం వచ్చినట్టు కొంతమంది గ్రామస్తులు తెలిపారు. బియ్యాన్ని కాల్చితే నల్ల బడినట్టుగా వారు వేంపల్లి లోని రేషన్ షాప్ ఎదుట ఆందోళనకు దిగిన సందర్భాన్ని చూశాము. తాజాగా ఇలాంటి పరిణామమే కొమురం భీం జిల్లాలో మరోమారు ఇలాంటి బియ్యం బయటపడడం చర్చనీయాంశంగా మారింది. చూశారు కదా ఫ్రెండ్స్, షాప్ కి వెళ్లేటప్పుడు రైస్ ను కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు బాగా  పరిశీలించి తీసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: