SBI ( స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఈసారి సరికొత్త ప్రయత్నం చేయబోతూ మన ముందుకు వచ్చింది. ఎస్బిఐ బ్యాంకు ఒక వేలం పాటను ప్రకటించింది. బ్యాంకులో  తాకట్టు  పెట్టిన ఆస్తులను ఈ-వేలం ద్వారా ( ఎలక్ట్రానిక్ వేలం )వేలం వేయడానికి తేదీని కూడా ప్రకటించింది. ఎస్బిఐ మార్చి 5వ తేదీన ఈ-వేలంలో అందించే ఆస్తులలో హౌసింగ్, రెసిడెన్షియల్,కమర్షియల్, ఇండస్ట్రియల్ మొదలైనవి ఉండనున్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ - వేలం పాటకు హాజరవ్వాలని sbi తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.


అతి తక్కువ ధరలో రెసిడెన్షియల్,కమర్షియల్,ప్రాపర్టీస్, భూమి, ప్లాంట్, మెషిన్స్, వాహనాలు మొదలైన ఉన్నాయి. ఈ వేలంపాటలో పాల్గొని మీ  'బీ ఐ డీ 'ని ఇవ్వండి అని ట్వీట్ చేసింది.

" స్థిరమైన ఆస్తులను పెట్టేటప్పుడు  మేము చాలా పారదర్శకంగా ఉంటామని ఎస్బిఐ తెలిపింది. బ్యాంకులో తనఖా పెట్టడం, వేలం వేయడానికి కోర్టు ఉత్తర్వులతో జమ చేసి.. వేలంపాటలో పాల్గొనే వారికి ఆకర్షణీయమైన ప్రతిపాదనగా మారే అన్ని సంబంధిత వివరాలను ఇవ్వడం ద్వారా మేము అన్ని సంబంధ విషయాలను కూడా చేర్చుకుంటాము. వివరాలు, అదే ఫ్రీహూల్డ్ లేదా లిజ్ హుల్డ్ కాదా, దాని కొలత, స్థానం మొదలైనవి ఉంటాయి.

ఈ వేలం కోసం జారీ చేసిన పబ్లిక్ నోటీసుల లోని ఇతర సంబంధిత వివరాలను పొందుపరచాయి ఎస్బిఐ  సంస్థలు. ఈ మెగా వేలం పాట లో పాల్గొనడానికి కావలసినవి..

1). ఈ వేలంలో నోటీసులో పేర్కొన్న విధంగా నిర్దిష్ట ఆస్తి కోసం EMD.
2). కేవైసీ పత్రాలను సంబంధిత శాఖకు సమర్పించాల్సి ఉంటుంది.
3). వ్యాలిడిటీ అయ్యే డిజిటల్ సంతకం
 అంటే డిజిటల్ సంతకాన్ని పొందడానికి బిడ్డర్లు ఈ -  వేలం వేసే వారిని, లేదా మరే ఇతర సంబంధిత  ఏజెన్సీని  సంప్రదించవచ్చు.
4). బిడ్డర్ ఈ ఎమ్ డీ డిపాజిట్, కేవైసీ పత్రాలను సంబంధిత శాఖకు సమర్పించిన తర్వాత వారి రిజిస్టర్డ్ లాగిన్ ఐడి తోపాటు పాస్వర్డ్లను ఈ వేలం వేసే వారు వారి ఈ మెయిల్ ఐడి కి పంపుతారు. మార్చి 5వ తేదీన వేలంపాట ఉండబోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: