సాధారణంగా మనం చనిపోయిన వారిని పూడ్చి పెడతాం. లేదంటే కలుస్తారు. అలానే చనిపోయిన వారి అస్తికలను ఏ పవిత్రమైన నదుల లోనూ, సముద్రాలలోను కలుపుతాం. అలా చనిపోయిన వారి అస్తికలను నీటి లో కలపడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని చిన్న నమ్మకం. కానీ ఓ వ్యక్తి కొడుకు, కూతురు  తన తండ్రి అస్థికలు, తల వెంటుకలను పబ్‌కు తీసుకెళ్లారు. బీర్ ఆర్డర్ చేసి  అస్థికలను అందులో కలిపారు. ఆ తర్వాత వాటిని డ్రైనేజీలో పోశారు. అయితే అతను అలా ఎందుకు చేశాడు? ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


 చనిపోయిన ఆప్తుల అస్థికలను సముద్రం లేదా నదుల్లో కలుపుతారనే విషయం తెలిసిందే. యూకేలోని కావెంట్రీకి చెందిన ఓ వ్యక్తి తన తండ్రి అస్థికలను బీరులో కలిపాడు. అయితే, అతడు అంతటితో ఆగలేదు. అస్థికలు కలిపిన ఆ బీరును.. పబ్ డ్రైనేజీలో పోశాడు. అదేంటీ అతడికి ఏమైనా పిచ్చా? తండ్రి అస్థికలను అలా డ్రైనేజీలో పోయడం ఏమిటనేగా మీ సందేహం. అయితే, ఇందులో అతడి తప్పేమీ లేదు. అది అతడి తండ్రి ఆఖరి కోరిక.


 కెవిన్ మెక్‌గ్లించే అనే వ్యక్తి చనిపోతూ తన కొడుకును వింత కోరిక కోరాడు. తాను మరణించిన తర్వాత ఆస్థికలను తనకు ఎంతో ఇష్టమైన హోలీబుష్‌ పబ్‌కు తీసుకెళ్లాలని, బీరులో వాటిని కలిపాలని తెలిపాడు. దీంతో కెవిన్ పుట్టిన రోజున కొడుకు ఒవెన్, కూతురు కాస్సిడేలు కలిసి ఆ పబ్‌కు వెళ్లారు. తండ్రి చెప్పినట్లే చేశారు. ఆ తర్వాత ఆ బీరును పబ్ ముందున్న డ్రైనేజీలో కలిపారు.



ఈ సందర్భంగా ఓవెన్ మాట్లాడుతూ ఇది కొంచెం పిచ్చిగానే అనిపించవచ్చు. ఇది నా తండ్రి ఆఖరి కోరిక. ఆయన ఎప్పటికీ ఇక్కడే ఉంటారు. ఆయన ఎప్పుడూ తన అస్థికలను పబ్‌ డ్రైనేజీలోనే కలపాలని కోరేవాడు. అందుకే, ఇలా చేయాల్సి వచ్చింది.అని తెలిపాడు. అంతేకాదు కెవిన్ మరో వింత కోరిక కూడా కోరాడు. చనిపోయిన తర్వాత తన తల వెంటుకలను కూడా పబ్‌ డ్రైనేజీలో కలపాలని తెలిపాడు. అతడు చెప్పినట్లే అతడి కొడుకు, కూతురు అస్థికలతోపాటు కలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: