సాధారణంగా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డుమీద మూగజీవాలు చనిపోయి ఉండటం చూస్తాం. మనం స్పీడ్ గా  డ్రైవింగ్ చేయడం వల్ల ఆ మూగజీవాలు రోడ్డు దాటుకునే క్రమంలో వాహనాల కిందపడి చనిపోతాయి.  అయితే మనం చనిపోయిన ఆ మూగ జీవాల మీదే అలానే వాహనాలు నడుపుతూ ఉంటాం. మనుషులకు మాత్రమే కాదు మానవత్వం అనేది జంతువులకు కూడా ఉంటుంది అని ఈ ఏనుగు నిరూపించింది. అయితే మనసుతో ఆలోచించడం మనుషులకు మాత్రమే సాధ్యం అని అనుకునే వాళ్ళం. చెప్పాలి అంటే మనుషుల కంటే మంచి మనసు జంతువులకు కూడా ఉంటుంది. నమ్మ బుద్ధి కావడం లేదా? అయితే ఏనుగు ఏంచేసిందో చూడండి.



 కొన్ని రోజుల  కిందట ఆకతాయిలు పైనాపిల్‌లో బాంబు పెట్టి  గర్భంతో ఉన్న ఏనుగు మరణానికి కారణమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ మావటి ఏనుగును కట్టేసి దారుణంగా కొట్టాడు.అమాయక మూగ జీవులను అడవుల్లో వదలకుండా మన అవసరాలకు వాడుకోవడం ఏ మాత్రం సబబు కాదు. అలాంటి పనులు చేసేవాళ్లు అస్సలు మనుషులే కాదు. వారు కనీసం ఈ ఏనుగును చూసైనా బుద్ధి తెచ్చుకోవడం మేలు. మన మూగజీవాలను ప్రేమించక పోయినా పర్లేదు కానీ వాటికి హాని మాత్రం తల పెట్టకుండా ఉంటే చాలు.



ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద ట్వీట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ మావటి ఓ ఏనుగుకు సంకెళ్లు వేసి రోడ్డు మీద నడిపిస్తున్నాడు. ఆ సమయంలో ఏనుగుకు రోడ్డు మీద చనిపోయిన కుక్క మృతదేహం కనిపించింది. దీంతో ఆ ఏనుగు.. దాని దాటి వెళ్లకుండా పక్క నుంచి వెళ్లింది. అయితే, మనుషుల వాహనాలు మాత్రం ఆ కుక్క మృతదేహం మీద నుంచి వెళ్లడం గమనార్హం.



 సుశాంత్ నందా ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.‘‘సంకెళ్లతో బందించినా మనసుతో ఆలోచించింది. వన్య మృగాలను సంకెళ్లు, బోనుల్లో బందించకుండా వదిలిపెట్టండి’’ అని పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజనులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. వాహనాలు ఆ కుక్క మీద నుంచి వెళ్తున్నా.ఆ ఏనుగు మాత్రం ఆ కుక్క మీద నుంచి వెళ్లకుండా ఎంత గౌరవంగా పక్కకి తప్పుకుందో చూడండి అని అంటున్నారు. ఈ వీడియో చూసి మీరు కామెంట్స్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: