సాధారణంగా రైలు ప్రయాణిస్తున్నప్పుడు రైలు కింద వస్తువులు లేదా జీవులు  లేదా మనుషులు ఉన్న కూడా రైలును ఆపకుండా నడుపుతారు. రైలులో వందలాది మంది ప్రయాణిస్తుంటారు ఆ ఒక్క జీవి కోసం రైలుని ఆపలేరు. అందువలన రైలు పట్టాలపై ఏమి ఉన్నా కూడా అలానే వాటిమీద నడుపుతారు. అయితే కొన్ని సందర్భాలలో పట్టాలపై జీవరాసులు ఉన్నది చూసి కొన్ని రైళ్లు ఆగుతాయి. అయితే ఒక పిల్లి వలన రైలు మూడు గంటలసేపు పాటు నిలిచిపోయింది.  మీరు విన్నది నిజమే. ఈ ఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పిల్లి మంచి శకునం కాదని అంటారు. శుభకార్యాలకు వెళ్లేప్పుడు పిల్లి ఎదురైతే హడలిపోతారు. కొందరైతే ప్రయాణాలను సైతం వాయిదా వేసుకుంటారు. ఇవన్నీ మన నమ్మకాలు. ఇలాంటివి కేవలం మన దేశంలో మాత్రమే జరుగుతాయి. అయితే, లండన్‌లో ఓ పిల్లి వల్ల రైలు మూడు గంటలు సేపు ఆగిపోయింది. వారికి కూడా మనలా సెంటిమెంట్స్ ఉన్నాయా అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఆ పిల్లి రైలుకు ఎదురుగా రాలేదు. ఏకంగా రైలు మీదకు ఎక్కి ఫ్రీగా జర్నీ చేయాలని అనుకుంది. అయితే, అది కరెంట్‌తో పరుగులు తీసే ఫాస్టెస్ ట్రైన్ కావడం వల్ల పిల్లి ప్రాణాలకే కాకుండా ప్రయాణికులకూ ముప్పనే కారణంతో అధికారులు రైలును నిలిపేశారు.


ఈ ఘటన యుస్టన్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. లండన్ యుస్టన్ నుంచి మంచెస్టర్‌కు ప్రయాణికులతో బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న అవంతి వెస్ట్ కోస్ట్ పెండలినో రైలు మీద పిల్లి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ సమయంలో రైలు నడిపితే పిల్లికే కాకుండా ప్రయాణికులకు సైతం ముప్పేనని భావించారు. వెంటనే ప్రయాణికులను వేరే రైల్లోకి పంపించారు. అయితే, అది రైలు దిగేందుకు పేచీ పెట్టింది. సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టింది. దాన్ని ఎలాగైనా ప్రాణాలతో పట్టుకోవాలనే లక్ష్యంతో సిబ్బంది ఎంతో ఓపికగా ప్రయత్నించారు.


మూడు గంటలు శ్రమించి ఆ పిల్లిని ఎట్టకేలకు రైలు మీద నుంచి కిందకి దింపగలిగారు. అనంతరం ఆ రైలును రీషెడ్యూల్ చేసి నడిపారు.చిన్న పిల్లి పెద్ద రైలును ఆపేసింది. రైలు మీదకు ఎక్కిన ఆ పిల్లి  కిందకు దిగనని పేచీ పెట్టింది. అలా మూడు గంటల సేపు సిబ్బందిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. ఎట్టకేలకు కిందకి దిగి బైబై చెప్పి వెళ్లిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: