సాధారణం గా పెళ్లి అంటే నూరేళ్ళపంట. జీవితంలో ఒకసారి జరిగే ఈ పెళ్లిని చాలామంది తమకు నచ్చిన విదంగా పెళ్లిలో సంగీత్,మెహందీ,డీజే ఇలా గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటారు. అయితే హిందూ సంప్రదాయ ప్రకారం పెళ్లి లో జరిగే కొన్ని పద్ధతులను పాటించాలి.  అంటే హిందూ సంప్రదాయంలో జరిగే పెళ్లిళ్లలో వధూవరులు జీలకర్ర బెల్లం తలపై పెట్టుకుంటారు. చెంగు చెంగు ముడి వేసుకుని అగ్నిహోత్రం చుట్టూ ఏడు అడుగులు వేస్తారు. ఇవన్నీ ఎంతో నిష్ఠగా శ్రద్ధగా చేస్తారు.  అలాగే పెళ్లి అయిపోయిన తర్వాత రిసెప్షన్ డీజే లాంటివి పెట్టుకొని డ్యాన్సులు చేస్తూ ఎంతో ఆనందంగా గడుపుతారు. అయితే ఇక్కడ ఒక జంట మాత్రం ఏకంగా పెళ్లి మండపం పైనే పవిత్రమైన అగ్నిహోత్రం చుట్టూ ఏడు అడుగులు వేయాల్సిన జంట దానిచుట్టూ డాన్స్ చేసారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తోంది. ఈ విషయం గురించి మరింత తెలుసుకుందాం.


 అయితే, ఓ జంట అగ్నిహోత్రం చుట్టూ ఏడు అడుగులు వేయడం మానేసి డ్యాన్స్ చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. పార్టీల్లో మంటల చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేస్తున్నట్లుగా అగ్నిహోత్రం వద్ద చిందులేశారు. పండితుడి వేద మంత్రాలు చదువుతున్న సమయంలో డీజే మ్యూజిక్ ఆన్ చేయడంతో ఆ జంట ఆగలేపోయారు. ఏడు అడుగులు వేయడానికి బదులు డ్యాన్స్ వేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. అతిథులు కూడా చప్పట్లు కొడుతూ వారిని ప్రోత్సహించారు. అయితే, ఇది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం. కానీ, సోషల్ మీడియా మాత్రం దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది.


కారణం ఓ ప్రముఖ వ్యక్తి ఈ వీడియోను పోస్ట్ చేసి విమర్శించడమే.బిర్లా ప్రెసిషన్ టెక్నాలజీస్ ఛైర్మన్, ఎండీ వేదాంత్ బిర్లా ట్వీట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘ఇది పెళ్లా? లేదా సంస్కారాలను దహనం చేసే కార్యక్రమమా? ప్రపంచం మిమ్మల్ని గొప్పగా భావిస్తుందంటే.. అది కేవలం మన సంస్కృతి, విలువల వల్లే అనే విషయాన్ని మరిచిపోకండి’’ అనే క్యాప్షన్‌తో ఈ ట్వీట్ చేశారు.



అయితే, ఈ ట్వీట్‌పై నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతాయి. ‘‘పెళ్లి తంతు పూర్తయ్యే వరకు ఆగలేకపోతున్నారా? అగిహోత్రం వద్దే డ్యాన్సులు చేస్తున్నారని పలువురు కామెంట్ చేస్తుంటే.. ఇంకొందరు పవిత్రమైన అగ్నిహోత్రం వద్ద అలా డ్యాన్స్ చేయడం మంచిది కాదని అంటున్నారు. బహుశా అది వెడ్డింగ్ ప్లానర్ ఆలోచన కావచ్చని, ఏడడుగులు వేసే సమయంలో మ్యూజిక్ పెట్టి.. వారితో డ్యాన్స్ చేయించి ఉంటాడని తెలుపుతున్నారు. వారివల్లే మన సాంప్రదాయలు నాశనమవుతున్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: