కరోనా మహమ్మారి కారణంగా  మనం ఎక్కడికి వెళ్ళినా మాస్కులు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా వల్ల మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరిగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుచోట్ల మాస్కులు లేకుంటే లోనికి ప్రవేశం లేదు అని బోర్డు కూడా చూస్తూ ఉంటాం. అయితే, ఒక్కోసారి బయటకు వెళ్లేప్పుడు మాస్క్‌ను మరిచిపోతూ ఉంటాం. మన దేశంలో మాస్క్ పెట్టుకోకుండా తిరిగినా ఎవరూ పట్టించుకోరు. కానీ, కొన్ని దేశాలు మాత్రం ఈ నిబంధన కచ్చితంగా అమలు చేస్తు్న్నాయి. మాస్క్ లేకుండా తిరిగేవారికి జరిమానాలు విధిస్తున్నారు. ఇక షాపింగ్ మాల్స్‌లో మాస్క్ పెట్టుకోకుండా వెళ్లేవారికి వస్తువులను కొనుగోలు చేసేందుకు అనుమతి కూడా ఇవ్వడం లేదు.


దక్షిణాఫ్రికాలో ఓ మహిళ మాస్క్ పెట్టుకోకుండా సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. అయితే, ఆమె మాస్క్ పెట్టుకోవడం మరిచిపోయింది. దీంతో కౌంటర్ వద్ద ఉన్న ఓ సెక్యూరిటీ గార్డ్ ఆమెను మాస్క్ ధరించాలని కోరింది. తాను మాస్క్ మరిచిపోయానని, తనని షాపింగ్ పూర్తిచేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే, మాస్క్ ఉంటేనే అనుమతిస్తామని గార్డ్ చెప్పడంతో  ఆమె తన అండర్‌వేర్‌ను తీసి మూతి, ముక్కు కవరయ్యేలా మూసుకుంది. అదిచూసిన తోటి కస్టమర్లు ఆమె చేసిన పనికి నోరెళ్లబెట్టారు. ఈ సందర్భంగా ఓ మహిళ  ఆమె చేసిన పనికి ఆశ్చర్యపోతూ ‘‘మీరు చేసింది కరక్టే.                                          


మాస్క్ మీద కంటే మీరు ధరించిన అండర్‌వేర్ మీదే తక్కువ బ్యాక్టీరియా ఉంటుంది’’ అంటూ చప్పట్లు కొట్టింది. కొందరు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే, నెటిజనులు ఆమె అండర్‌వేర్‌ను మాస్క్‌గా ధరించడాన్ని తప్పుబడుతున్నారు. మాస్క్ పెట్టుకోకుండా వచ్చిన ఆమెను లోపలికి ఎలా అనుమతించారంటూ మార్కెట్ గార్డులను సైతం ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: