అమ్మ ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం ఇంకా ఎన్నెన్నో ఎంత చెప్పినా తక్కువే మాటలకు అందనిది అమ్మ ప్రేమ. కడుపులో నలుసు పడిన నాటి నుంచి నవ మాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ‘అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకో’ అని ఒకరు, ‘ఎవరు రాయగలరూ అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరూ అమ్మా అనురాగం తీయని రాగం’అంటూ మరొకరు అమ్మ గొప్పదనాన్ని తన పాట ద్వారా వ్యక్తం చేశారు. అమ్మను మించి దైవం ఉందా? అవును మరి అవతారమూర్తి కూడా అమ్మకు కొడుకే కదా.


ఈ లోకంలో స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీలేకపోతే అసలు సృష్టే లేదు. మరి మనల్ని కంటిపాపలా కాపాడే ‘స్త్రీమూర్తి’ని స్మరించుకోవడం మన అందరి బాధ్యత. తల్లిగా లాలిస్తూ చెల్లిగా తోడుంటూ భార్యగా బాగోగులు చూస్తూ  దాసిలా పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తూ  సర్వం త్యాగం చేస్తుంది మహిళ. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇదే.


అమ్మను పూజించు..భార్యను ప్రేమించు..సోదరిని దీవించు..ముఖ్యంగా స్త్రీని గౌరవించు..
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

 యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’’ - స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు.- అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో..
అక్కడ దేవతలు కొలువై ఉంటారు.
- అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

అమ్మను పూజించు.. భార్యను ప్రేమించు.. సోదరిని దీవించు  ముఖ్యంగా మహిళలను గౌరవించు’’ జననం నీవే.. గమనం నీవే..సృష్టవి నీవే.. కర్తవు నీవే..కర్మను వనీవే.. ఈ జగమంతా నీవే..
అందుకే భగవంతుడు అన్ని చోట్లా.ఉండలేక ప్రతిఇంట్లో నిన్ను సృష్టించాడు.ఓ మహిళా నీకిదే మా వందనం
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

కనులు తెరిచిన క్షణం నుంచి  బంధం కోసం బాధ్యత కోసం కుటుంబం కోసం అందర్నీ కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి, తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ మూర్తికి పాదాభివందనం- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

అన్నం కలిపి గోరు ముద్ద పెట్టేప్పుడు తన బిడ్డ ఉన్న ప్రేమ కూడా కలిపి పెడుతుంది. ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా ఆ ముద్దలు తింటుంటే ఆ బిడ్డ కడుపు నిండుతుందో లేదో కానీ, ఆ తల్లి కడుపు ఆనందంతో నిండిపోతుంది. అదీ అమ్మ ప్రేమంటే. స్త్రీమూర్తి గొప్పతనమంటే.
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి: