ఇంటర్నెట్ డెస్క్: ‘డబ్బెవరికి చేదు’ అంటారు పెద్దలు. అంటే డబ్బు ఊరకనే వస్తుంటే ఎవ్వరూ వద్దనరు. అయితే ఇక బంగారం దొరుకుతుంటే.. ఎవరైనా ఖాళీగా ఉంటారా..? ఎగబడి మరీ పట్టుకుపోతారు కదా..? అదే జరుగుతోంది అక్కడ. అయితే అక్కడ దొరుకుతున్న బంగారం ఏదో గ్రాముల్లో, కిలోల్లో కాదు.. ఏకంగా వేల టన్నుల్లో. ఎందుకంటే అదో కొండ. అవును.. ఆ కొండ నిండా బంగారమే ఉంది. ఆ విషయం తెలియగానే.. అక్కడి ప్రజలంతా ఏకంగా పలుగులు, పారలు తీసుకుని వెళ్లి మొత్తం తవ్వి ఏరుకోవడం మొదలు పెట్టారు.

కాంగోలోని సౌత్ కివు ప్రావిన్స్‌లో లుహిహి ప్రాంతంలో ఓ కొండ ఉంది. అది ఓ బంగారపు కొండ. ఓ కొండలోని మట్టిలో దాదాపు 90 శాతం వరకు బంగారం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఆ కొండ దగ్గరికి ఆ పరిసరాల్లోని ప్రజలు గడ్డపారలతో పోటెత్తారు. సాధ్యమైనంత ఎక్కువ బంగారాన్ని సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అహ్మద్ అల్గోబరీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో లుహిహిలోని కొండ దగ్గరికి భారీగా జనం ఆత్రుతగా వెళ్తుండటం గుర్తించాడు. కొందరు గడ్డపారలతో ఈ కొండను తవ్వుతుండగా, మరికొందరు కేవలం చేతులతోనే మట్టిని తవ్వుతున్నారు. వీరు ఈ మట్టిని తమ ఇళ్ళకు తీసుకెళ్ళి, బంగారాన్ని సేకరిస్తున్నారని అహ్మద్ తన సోషల్ మీడియాలో ఓ మెసేజ్ పోస్ట్ చేశాడు.

కాంగోలో టింబర్, వజ్రాలు, ఖనిజాల నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. వీటిని స్థానికులు చిన్న చిన్న పరికరాలతో తవ్వుకోవడం సర్వసాధారణం. అహ్మద్ చేసిన పోస్ట్‌తో ఈ విషయం మరింత వైరలైంది. ఆ నోటా ఈ నోటా చేరి ప్రభుత్వం దృష్టికి కూడా చేరింది. దీంతో సౌత్ కివు గనుల శాఖ మంత్రి వెనంట్ బురుమె ముహిగిర్వా స్పందించారు. ఈ గ్రామం చాలా చిన్నదని, ఇక్కడ బంగారు కొండ ఉందని తెలియడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని చెప్పారు. ప్రజలు భారీ ఎత్తున వస్తుండటంతో ఈ కొండను తవ్వడాన్ని నిషేధించామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: