పాములు చెట్ల మీద ఉంటాయి...చెట్ల మధ్య లో తిరుగుతాయి. అయితే ఇప్పుడు ఒక పాము సూపర్ మార్కెట్ లో ప్రత్యక్షమైంది. అది కూడా బ్రతికే ఉంది. అది చూడని ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్ళాడు. తీరా వంట చేసుకుందామని ఓపెన్ చేద్దామనుకునే చేతిలో పట్టుకున్నాడు.. బుస్సు బూస్సు.. శబ్దం వినిపించి చూసి పాము ఉందని తెలుసుకున్నాడు.ఈ విషయాన్ని సూపర్ మార్కెట్ యాజమాన్యం తో చెప్పాడు. వాళ్ళు ఈ విషయం గురించి ఆరా తీయగా 900 కిలోమీటర్లు ప్రయాణించిందని తెలుసుకొని ఆశ్చర్యానికి లోనయ్యారు. 


వివరాల్లోకి వెళితే..కిచెన్‌లోకి పాము ప్రత్యక్షమైన సంఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి చెందిన ఓ వ్యక్తికి ఎదురైంది. సిడ్నీకి చెందిన అలెక్స్‌ వైట్‌ ఒకరోజు సూపర్‌మార్కెట్‌కు వెళ్లి సరుకులను తీసుకొని వచ్చాడు. ఇంటికి వచ్చాక సరుకులను తీస్తుండగా ఒక్కసారిగా ఖంగు తిన్నాడు. అతడు తెచ్చిన పాలకూర ప్యాకెట్ ‌లో పాము ప్రత్యక్షమైంది. పాము బుసలు కొట్టడం తో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీంతో అలెక్స్‌ భయపడిపోయి ప్యాకెట్‌ను దూరంగా విసిరేశాడు. అటవీ శాఖ సిబ్బందికి ఈ విషయం గురించి చెప్పాడు. వాళ్ళు వచ్చి ఆ పాము కాటువేసి ఉంటే తీవ్రమైన పరిణామాలు ఉండేవని వైర్స్‌ రెస్యూ సిబ్బంది తెలిపారు.


కాగా, ఈ విషయాన్ని అలెక్స్ అలెక్స్‌ వైట్‌ ఈ విషయాన్ని సూపర్‌ మార్కెట్‌ యాజమన్యాని కి తెలిపాడు. పాము సూపర్ మార్కెట్లోకి ఎలా ప్రవేశించిందో అనే విషయాన్ని పరిశీలించగా, ఆస్ట్రేలియా లోని తూవూంబా నగరంలో ఒక ప్యాకింగ్ ప్లాంట్ నుంచి సిడ్నీకి 900 కిలోమీటర్లు పాము ప్రయాణం చేసినట్లు అధికారులు చెప్పారు. ప్యాక్ చేసిన ఉత్పత్తుల లో మొదటిసారి పామును చూశామని స్థానిక సిబ్బంది తెలిపారు. అంతేకాకుండా ప్యాకింగ్‌ చేసిన కూరగాయల్లో తరచూ కప్పలు కూడా రావడం చూస్తున్నామని తెలిపాడు. ఇది నిజంగానే షాకింగ్ సంఘటన అనే చెప్పాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: