మ్యాగీ.. ఈ పేరు తెలియని వాళ్ళు దేశంలో ఎవరూ ఉండరెమో.. చాలా ఈజీగా అయిపోయే ఈ వంటను చేసుకోవడం చిన్న పిల్లలకు కూడా సరదా...అందులో వాడే పదార్థాలు అంత రుచిగా ఉంటాయి.. అందుకే మ్యాగీ పేరు వినగానే ప్రతి ఒక్కరికీ నోరు ఊరుతుంది.వయస్సుతో సంబంధం లేకుండా దీనిని ఇష్టపడుతున్నారు. తయారీకి పట్టే సమయం కూడా చాలా తక్కువ. ఇది ఇన్‌స్టాంట్‌ మ్యాగీగా మనకు మార్కెట్‌లో లభిస్తుంది. దీని ప్యాకింగ్‌ చేసేటేప్పుడే అన్ని రకాల పదార్ధాలతో కలిసి ఉంటుంది. దీన్ని వేడినీళ్లలో వేయగానే.. ఆహా అనిపించే రుచికరమైన మ్యాగీ క్షణాల్లో ముందుంటుంది.


అయితే ఈ మ్యాగీని ఉడక బెట్టకుండా చాలా మంది అలానే తింటారు. అలా తిన్నా కూడా రుచిగా ఉంటుంది. కొంతమంది మాత్రం ట్రెండ్‌ను ఫాలో కాకుండా సెట్‌ చేశారు. మ్యాగీ తో వివిధ రకాల వంటలను చేసుకోవచ్చు అని నిరూపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది మ్యాగీ తో సూప్ లు, స్నాక్స్ చేసుకొని సోషల్ మీడియా లో ఆ వంట రుచిని పంచుకుంటున్నారు. అవి కాస్త వైరల్ అవుతున్నాయి. 


తాజాగా మరో వంట గురించి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. మ్యాగీతో లడ్డు చేస్తే ఎలా ఉంటుందో అనుకున్నారో.. ఏమో గానీ.. వెంటనే వారి ఆలోచనను అమలు చేసేశారు. మ్యాగీతో లడ్డు ప్రయోగం చేశారు. ఇంతటితో ఆగకుండా దానిపై అందంగా కాజునికూడా ఉంచారు... ఆ అందమైన లడ్డు తాయారి విధానం ఒకసారి చూద్దాం.. 


ముందుగా బెల్లం తీసుకొని లేత పాకం చేసుకోవాలి. దానిలో ఈ మ్యాగీని చిన్నగా నలిపి వేసి బాగా కలపాలి.. పాకం చల్లారాక ముద్దలుగా చేసుకోవాలి.. అంతే రుచికరమైన లడ్డు రెడీ.. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చెయ్యండి.. ఇప్పుడు, దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ' వావ్ అని అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: