యుట్యూబ్ స్టార్, ఫన్ బకెట్ భార్గవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎందుకంటే టిక్ టాక్ ద్వారా కూడా ఇతగాడు మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. కాగా, ఇప్పుడు ఇతను రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు.14ఏళ్ల మైనర్ బాలిక ను మానభంగం చేసిన కేసు లో భార్గవ్ ని పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం. వైజాక్ పోలీసులు భార్గవ్ ని అరెస్ట్ చేయడం తో పాటు, అతని పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని యాంకర్ శివ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 


ఇక వివరాల్లోకి వెళితే.. పెందుర్తి సింహపురి కాలిని లో ఉంటున్న  పదనాలుగెళ్ల బాలిక టిక్ టాక్ పై మోజూ పెంచుకుంది. ఆ క్రమం లో టిక్ టాక్ భార్గవ్ కు దగ్గరైంది. అతనితో కలిసి వీడియోలు కూడా చేసింది. నిన్ను పెద్ద స్టార్ ను చేస్తానని చెప్పడం తో నమ్మింది. అతనికి సర్వస్వాన్ని అర్పించింది.  శారీరకంగా అనేక సార్లు దగ్గరైనట్లు తెలుస్తుంది. దీని ఫలితంగా ఆమెకు నాలుగు నెలల గర్భం వచ్చింది. దీంతో భార్గవ్ అసలు స్వరూపం బయట పడింది. 


బాలిక తల్లి నిలదీయగా అసలు నిజం బయట పెట్టింది.. బాధితురాలిని వెంటబెట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న దిశ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. భార్గవ్ కు మంచి అవకాశాలు రావడంతో హైదరాబాద్ వెళ్ళాడని బాలిక చెప్పుకొచ్చింది. అతను సెటిల్ అయ్యాక ఆమెను కూడా తీసుకెళతానని చెప్పినట్లు తెలుస్తోంది. అతను ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈ ఘటన పై పూర్తి వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.ఈ వార్త బయటకు పొక్కడంతో సోషల్ మీడియా లో అనేక చర్చలు జరుగుతున్నాయి.. ఈ విషయం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. 




మరింత సమాచారం తెలుసుకోండి: