అప్పుడప్పుడు పోలీసులకు కొన్ని వింత ఫిర్యాదులు వస్తుంటాయి. అసలే కరోనా విలయ తాండవానికి దేశం మొత్తం బాధపడుతున్నారు. ఇక పోలీస్ లు కూడా తమ పనుల్లో ఫుల్ బిజీగా అయిపోయారు. అలాంటి పోలీసులకు వింత కేసులు వస్తున్నాయట. తాజగా వచ్చిన కేసుకి పోలీసులకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందట. కాని ఆ కంప్లైంట్ వెనకాల ఒక బలమైన రీజన్ వుంది.ఆ కంప్లైంట్ ఏంటో మీకు అర్ధమయ్యే ఉంటుంది. కాని టైటిల్ చూసి నవ్వుకోకండి. ఈ న్యూస్ పూర్తిగా చదవండి.ప్రస్తుతం ఇది నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.

ఇక విషయానికి వస్తే తమ కోళ్లు గుడ్లు పెట్టడం లేదంటూ మహారాష్ట్రలోని పూణె సమీపంలోని మతోబచి అలండి గ్రామానికి చెందిన ఓ పౌల్ట్రీ రైతు లోని ఖల్బోర్ పోలీసులను ఆశ్రయించాడు. తన ఫాం లోని కోళ్లు కొద్దిరోజులుగా గుడ్లు పెట్టడం మానేశాయని ఫిర్యాదు చేశాడు. ఇటీవల ఓ కంపెనీ దాణా తెచ్చి కోళ్లకు వేస్తున్నామని.. అప్పటి నుంచి కోడిపెట్టలు గుడ్లు పెట్టడం మానేశాయని ఆయన వాపోయారు. తనొక్కడికే కాదని.. మరో నలుగురు పౌల్ట్రీ రైతులదీ ఇదే పరిస్థితని ఆయన చెప్పారు. ఆ రైతులు కూడా సదరు కంపెనీ దాణా వాడారని.. అప్పటి నుంచే ఈ పరిస్ధితి దాపురించిందని తన మోర వినిపించుకున్నాడు.

రైతు వింత కంప్లైంట్ పై లోని ఖల్బోర్ ఇన్‌చార్జి, సీనియర్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర మొకాషి స్పందించారు. మరో నలుగురు పౌల్ట్రీ రైతులు కూడా ఇదే సమస్య ఎదుర్కొన్నారని.. అహ్మద్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ కంపెనీ నుంచి దాణా తెచ్చి వాడినట్లు తెలిసిందన్నారు. కంపెనీ ప్రతినిధులను సంప్రదించామని ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర తెలిపారు. కోళ్లు గుడ్లు పెట్టడం లేదన్న విషయం తమకూ తెలిసిందన్న యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టామని.. అవసరమైతే నష్టపరిహారం అందజేస్తామని చెప్పిందని రాజేంద్ర చెప్పారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్‌కు విచారణకు రావాలని చెప్పామని.. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు.ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: