మనం ఒక్కరోజు ఆఫీస్ కి వెళ్లకుంటే మన బాస్ మనల్ని టార్చెర్ చెయ్యటం ఖాయం. కొంతమంది అయితే ఎంత పని చేసినా కాని జీతం మాత్రం ఇవ్వరు. అలాంటిది అతడు 15 ఏళ్లుగా విధులకు హాజరు కాకపోయినా కాని ఎవరూ కనిపెట్టలేకపోయారు. పైగా.. అతడికి క్రమం తప్పకుండా జీతం ఇస్తూనే ఉన్నారట. ఈ ఘటన ఇటలీలోని పుగ్లీసీ సియాసియో ఆసుపత్రిలో జరిగింది.కాటాన్జారోలోని కాలాబ్రియన్ నగరంలో ఉన్న ఈ హాస్పిటల్‌లో ఓ ఉద్యోగస్తుడు 2005వ సంవత్సరం నుంచి విధులకు హాజరు కావడం లేదు. అయితే, ఈ విషయాన్ని హెచ్‌ఆర్ డిపార్టుమెంట్ గుర్తించలేదు. అతడు గైర్హాజరైనా అటెండెన్సు ఎలా పడిందనేది మాత్రం మిస్టరీగా మారింది. అయితే, ఇందుకు అతడు కొన్ని విధానాలు పాటించాడని తెలిసింది. చివరికి.. అతడు తన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా హాస్పిటల్ డైరెక్టర్‌ను కూడా బెదిరించాడు. దీంతో అతడు నిందితుడికి సహకరించినట్లు తెలిసింది.


ఆ హాస్పిటల్ డైరెక్టర్ పదవీ విరమణ తర్వాత కూడా హెచ్ ఆర్ డిపార్ట్‌మెంట్ అతడి అటెండెన్సులో లోపాలను గుర్తించలేకపోయిందట. ఫలితంగా అతడికి 15 ఏళ్లుగా జీతం పడుతూనే ఉంది. ఇలా రూ.5,38,000 పౌండ్లు (రూ.4.85 కోట్లు) జీతాన్ని అతనికి చెల్లించడం జరిగింది. ఇక గత సంవత్సరం కరోనా వైరస్ నేపథ్యంలో విధులకు వెళుతున్న ఉద్యోగుల జాబితా తయారీ సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసి అతడి తోటి ఉద్యోగులు కూడా షాకయ్యారు. అతడు హాజరుకాకపోయినా జీతం ఎలా చెల్లించారని ఆశ్చర్యం వ్యక్తం చేశారట.ఈ విషయం తెలియగానే అతడిని విధుల నుంచి తొలగించారు. అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. హెచ్ఆర్‌లోని ఆరుగురు మెనేజర్లను విచారించారు. ఆ విభాగంలో ఎవరైనా అతడికి సహకరించి ఉండవచ్చని భావిస్తున్నారు.ఇక పోలీసులకి ఫిర్యాదు చెయ్యగా వారు అతడి అటెండెన్స్, శాలరీ రికార్డులు, తొటి ఉద్యోగులు స్టేట్‌మెంట్లను సేకరించింది.ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: