కొన్ని జాబ్స్ ఉంటాయి వాటి వాల్యూ ఒక్కోచోట ఒక్కో రకంగా ఉంటుంది. ఒక చోట వాటికి డిమాండ్ ఉంటుంది. ఇంకో చోట ఉండదు. ముఖ్యంగా మన దేశంలో వాటికి వాల్యూ ఉండదు. ఇక వివరాల్లోకి వెళితే..బహామాస్‌లో నివసిస్తున్న ఓ డబ్బున్న ఫ్యామిలీ ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారి ప్రైవేట్ ఐలాండ్‌లో పనిచేస్తే ఏడాదికి 1,20,000 డాలర్లు (ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం రూ.88 లక్షలు) చెల్లిస్తారు. అంటే నెలకు సుమారు రూ.7.3 లక్షలు జీతం చేతికి ఇస్తారట. అయితే ఈ జాబ్ ఎవరికీ పడితే వారికి కాదు.కేవలం పెళ్లయిన జంటకు మాత్రమే ఈ అవకాశం ఇస్తారు. జీతం బాగానే ఉంది కదా అప్లై చేసుకుందామని అనుకుంటున్నారా? అయితే, తొందరపడకండి. అక్కడ ఏం పని చేయాలో కూడా తెలుసుకోండి.


ఫ్లొరిడా, బ్రహ్మాస్‌లో ఆ కుటుంబానికి గల అన్ని ఇళ్లల్లో పనిచేయాల్సి ఉంటుంది.అంటే సింపుల్ గా చెప్పాలంటే పని మనిషి టైప్ అనమాట.Polo & Tweed వెబ్‌సైట్‌లో ఈ ఉద్యోగానికి సంబంధించిన వివరాలు వున్నాయి.ఈ ఉద్యోగం చేసే జంటకు జీతంతోపాటు హెల్త్‌కేర్, డెంటల్ బెనిఫిట్స్‌తోపాటు ఒక కారు కూడా ఇస్తారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేయాలి. ఒక్కోసారి వీకెండ్‌తోపాటు రాత్రి షిఫ్టుల్లో కూడా పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఈ పనికి కేవలం హౌస్‌హోల్డ్ మేనేజ్మెంట్, మెయింటెనెన్స్‌ అనుభవం ఉండాలి. వంట చేయడం వస్తే ఇంకా మంచిది. ఇంటికి సంబంధించి ఏ పనైనా సరే చేయాల్సిందే.


ఎయిర్‌పోర్ట్‌కు కారు తీసుకొని వెళ్లాలి. అతిథులను ఇంటికి తీసుకురావాలి. ఒక్కోసారి ఆ కుటుంబానికి చెందిన వేరే ప్రాపర్టీలో పనులు కూడా చూసుకోవాలి. ఈ ఉద్యోగం జంటకే ఇచ్చినా.. వారు కలిసి ఉండే అవకాశం చాలా తక్కువని వివరాల్లో చెప్పారు.వారి చేసే పని వైనం బాగా నచ్చితే జీవితకాలం తమతోనే ఉండవచ్చని ఆ కుటుంబం తెలిపింది. దీని గురించి ఏప్రిల్ 28న ఈ ప్రకటన చేయగా.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్నారు. వీరిలో మంచి అనుభవం ఉండేవారిని ఎంపిక చేసుకొనే పనిలో ఆ కుటుంబం ఉంది. మరీ ఈ అదృష్టం ఎవరికీ దక్కుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: