కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రతిరోజు మరణించే వారి సంఖ్య ఎక్కువవుతోంది. మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే డబుల్ మాస్క్ ధరించడం మంచిది అని కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇటీవల శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వైరస్ నుంచి మరింత సురక్షితంగా ఉండటం కోసం డబుల్ మాస్క్ ధరించాలని సూచనలు చేశారు కొందరు నిపుణులు. అయితే డబుల్ మాస్క్ ధరించటం వల్ల ఎంత వరకు మేలు జరుగుతుందో?  వాటి ప్రయోజనాలు ఏంటో? ఇప్పుడు ఇక్కడ చదివి  తెలుసుకుందాం..


మనం ప్రతి రోజూ డబుల్ మాస్క్ వేసుకోవడం వల్ల  కొంతమేరకు వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభావం చూపుతుందని తేలింది. కానీ తాజాగా డబుల్ మాస్క్ వాడకం పై కేంద్ర ప్రభుత్వం కీలకం మార్గదర్శకాలను జారీ చేసింది. అదేమిటంటే ప్రతి ఒక్కరూ రెండు మాస్క్ లను  ఒకే రకమైనవి వాడొద్దని కేంద్రం స్పష్టం చేసింది.


డబుల్ మాస్క్ లను ధరించేటప్పుడు  ముందు సర్జికల్ మాస్క్ దాని పైన  క్లాత్ మాస్క్ అనే రెండు వేరియంట్ల మాస్కులు ధరించాలని కేంద్రం సూచించింది. అంతేకాకుండా ఒకే మాస్క్ ను  వరుసగా రెండు రోజుల పాటు వాడొద్దని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సాధారణ క్లాత్ మాస్క్ 42 నుంచి 46 శాతం వరకు రక్షణ కల్పిస్తుందని అని అధ్యయనకర్తలు వెల్లడించారు. సర్జికల్ మాస్క్ అయితే 56.4 శాతం రక్షణ ఇస్తుందన్నారు. సర్జికల్ మాస్క్ పై క్లాత్ మాస్క్ ను ధరిస్తే కరోనా నుంచి ఏకంగా 85.4 శాతం వరకు రక్షణ లభిస్తుందని చెప్పుకొచ్చారు.


అయితే ఈ సర్జికల్ మాస్క్ వేసుకునేటప్పుడు రెండు వైపులా ముడి వేసుకొని వేసుకోవాలి. ఇక దానిపైన మీకు నచ్చిన ఏదైనా ఒక క్లాత్ మాస్క్ ను  వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల కరోనా వైరస్ నుంచి ఏకంగా 85.4 శాతం వరకు రక్షణ లభిస్తుంది. అయితే ఈ మాస్క్ వేసుకొని, ఒక సారి మీకు శ్వాస ఆడుతుందో? లేదో? కూడా చెక్ చేసుకొని మరీ వేసుకోవడం మంచిది. ఇక ఈ మాస్క్ వేసుకున్నప్పుడు ఏదైనా శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదురైతే, వీటిని వేసుకోకుండా ఉండడమే ఉత్తమం..



మరింత సమాచారం తెలుసుకోండి: