సాహసాలు అంటే ఇష్టపడే వాళ్ళు భయాన్ని పెద్దగా పట్టించుకోరు, కానీ కొన్నిసార్లు మాత్రం సాహసవంతులు కూడా భయపడే ప్రదేశాలని మనం చూస్తూ ఉంటాం.సరిగ్గా అలాంటిదే పోర్చుగల్ లోని బ్రీత్ ఆఫ్ ఎయిర్, అరౌకా 516 అని పిలువబడే వేలాడే బ్రిడ్జ్. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేలాడే బ్రిడ్జ్ గా గుర్తింపు పొందింది.ఎంతటి ధైర్యవంతులైన సరే ఈ బ్రిడ్జిని చూస్తే భయపడకుండా ఉండలేరు అంటే అతిశయోక్తి కాదు. పోర్చుగల్ లోని పావియా నదిపై 175 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు.దీని పొడవు 516 మీటర్లు (1693 అడుగులు) ఇది అగ్యిరాస్ జలపాతం నుంచి పావియా జార్జిని కలుపుతూ దాదాపు అర కిలోమీటర్ వరకు వేలాడుతూ అరౌకా జియో పార్క్ లో మంచి అడ్వెంచర్ స్పాట్ గా మారింది.
దీనికంటే ముందు 2017లో స్విజర్లాండ్ లో ఉన్న చార్లెస్ కుయోనన్ సస్పెన్షన్ 494 మీటర్ల ఎత్తుతో అప్పటివరకు నెంబర్ వన్ గా ఉండేది. కానీ చార్లెస్ కుయోనన్ సస్పెన్షన్ బ్రిడ్జిని పోర్చుగల్ లో ఏర్పాటు చేసిన అరౌకా బ్రిడ్జి 516 మీటర్ల పొడవుతో వెనక్కి నెట్టేసి ప్రస్తుతం వేలాడే బ్రిడ్జి లో నెంబర్ వన్ స్థానం లో కొనసాగుతుంది. అయితే ఈ బ్రిడ్జి పై నడవడం అంత సులభమేమీ కాదు. ఒకసారి ఆ బ్రిడ్జి పై నిలబడి నడుస్తూ కిందికి చూస్తే ప్రపంచం మొత్తం తలకిందులు అయినట్టు కనిపిస్తుంది ధైర్యంగా ఉన్నవాళ్లే భయపడుతున్నారు అంటే భయపడే వాళ్ళ పరిస్థితి ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు.ఈ బ్రిడ్జి పై కి వెళ్ళడానికి ఆరు నెలల పిల్లలకి అనుమతి లేదు. ఈసారి ఎవరైనా పోర్చుగల్ కి వెళితే తప్పకుండా ఆ బ్రిడ్జిని చూసి బాగా భయపడి రావాలని కోరుకుంటున్నాను. అన్నట్టు ఈ బ్రిడ్జిని చూడడానికి ఒక్కొక్కరు 12 నుంచి 14 డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: