ప్రపంచంలో ఎన్నో వింత వింత ప్రదేశాలు ఉంటాయి.. వాటిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.. ఇలాంటి వింతలన్నీ ప్రపంచంలో ఎనిమిది ఉన్నాయని తేల్చి చెప్పారు..వాటినే 8 వండర్స్ అని అంటారు.. వీటిని చూడడానికి ప్రపంచంలోని వీక్షకులు ఎగబడుతుంటారు.. వేలకు వేలు ఖర్చు పెట్టి పర్యాటకులు వీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.. అవేకాకుండా చిన్నస్థాయిలో అబ్బురపరిచే ప్రదేశాలు, కట్టడాలు చాలానే ఉన్నాయి.. ప్రపంచంలో వీటికి కూడా ప్రముఖ స్థానం ఉంది.. అలాంటి వింతైన ప్రదేశం సరసు లోపల అడవి ఉండడం..

ఇదేంటి సరస్సు లోపల అడవి ఉండడం ఏంటి అనుకుంటున్నారాయ.. నిజమే అండీ సరస్సు లోపల అడవి ఉంది.. కజకిస్థాన్ లోని ఓ సరస్సు లోపల అడవి ఉందని తెలిసి అక్కడికి పర్యాటకు లు వేలాదిమంది తరలి వస్తున్నారు. దీన్ని లేక్ క్యాండీ అని పిలుస్తుండగా ఈ సరస్సులో చెక్క స్థంబాలు ఉన్నాయి. కొన్ని చెట్లు నీటిలోనే ఉండగా మరికొన్ని చెట్లు నీటిలో మునిగి ఉంటాయి. చాలా చెట్లు ఉండడంతో ఈ సరస్సు లో అడవి ఉందన్న ప్రచారం జనాల్లోకి బాగా వెళ్ళింది..

అయితే ఇది ఎలా ఏర్పడిందో అని తెలుసుకోవడానికి చాల మంది ప్రయత్నించగా దానికి ఓ కారణం చెప్తున్నారు.. 1911 లో ఈ ప్రాంతంలో భారీ భూకంపం వచ్చిందట. దాంతో ఈ ప్రాంతం తీవ్ర గందర గోళంలో పడిందట. అడవి మొత్తం నీటి లో మునిగిపోయిందని, మాములుగా నీరు ఎక్కువగా ఉంటే చెట్లు కుళ్లిపోతాయి. కానీ విచిత్రంగా ఈ చెట్లు తాము నీటిలో ఉండడానికే అలవాటుపడ్డాయి.ప్రకృతి కి విరుద్ధంగా  నీటి లోప‌ల కూడా చాలా అడుగుల పొడవు పెరుగుతున్నాయి.ఈ సరస్సు సముద్ర మట్టానికి 2,000 మీటర్ల ఎత్తులో ఉంది.  ఇది కజకిస్థాన్ కు 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఇది పర్యాటకులను ఎంతగానో ఆకర్సతిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: