హైదరాబాద్ ను  మూసి నది ఒడ్డున క్రీస్తుశకం 1591లో కుతుబ్ షాహీ వంశస్థుడైన  మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు.

ముందుగా హైదరాబాద్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం..

మహమ్మద్ కులీ కుతుబ్ షా, భాగమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు.ఆ తరువాత ఆవిడ పేరు మీదనే భాగ్యనగరము అని పేరు పెట్టారు. అయితే భాగమతి ఇస్లాం మతం స్వీకరించి, హైదర్ మహల్ అని పేరు మార్చుకుంది. ఇక ఆ పేరు ను  అనుసరించి నగరం పేరు కూడా హైదరాబాద్ గా రూపాంతరం చెందింది.

చార్మినార్ :
ముందుగా మనందరికీ హైదరాబాద్ పేరు వినగానే గుర్తుకు వచ్చేది చార్మినార్. ఈ హైదరాబాద్ కు మధ్యలో చార్మినార్ ను మొహమ్మద్ కులీ కుతుబ్ షా 1591 లో అప్పటిదాకా విజృంభించిన ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నంగా నిర్మించాడు.

చంచెల్ గూడా:
చిచ్లం అనే బంజారా  ఉండే ఏరియా అది . కాలక్రమేణా చంచెల్ గూడా గా మారింది. ఇక ఈ ఏరియాలోనే భాగమతి కూడా నివాసం ఉండేదని చరిత్రకారులు చెబుతుంటారు.

లంగర్ హౌజ్:
గోల్కొండ నవాబుల కాలంలో సైనికులు భోజనం కోసం ఏర్పాటుచేసిన లంగర్ ఖానా కు వెళ్ళేవారట. అది కాలక్రమేణా లంగర్ హౌజ్ గా మారింది. అయితే గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారట..

అబిడ్స్:
ఆరో నిజాం కాలంలో ఆల్బర్ట్ అబిద్ అనే యోధుడు పాలెస్ టాకీస్ దగ్గర ఒక కంపెనీ ని పెట్టుకున్నాడు. దానికి అబిద్ దండు కంపెనీ అని పేరు పెట్టాడు. కాలక్రమేణా ఆ ప్రాంతం కాస్త అబిడ్స్ గా మారిపోయింది..

కార్వాన్:
ఒకప్పుడు సాహుకారి కార్వా అని పిలిచే ప్రాంతాన్ని ఇప్పుడు కార్వాన్ అని  పిలుస్తున్నారు. అయితే కోహినూరు వజ్రాన్ని సాన పెట్టింది కూడా ఇక్కడే..వజ్రాలు, ముత్యాల వ్యాపారస్తులు సమూహంగా చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతం కార్వాన్.

కవాడిగూడ:
ట్యాంక్ బండి నిర్మాణానికి కావడిలో నీళ్లు మోసిన కూలీలు, అక్కడే గుడిసెలు వేసుకొని నివసించేవారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని కావడిల గూడెం అని పిలిచేవారు. కాలక్రమేణా అది కవాడిగూడ గా మారింది.

బేగంబజార్:
హైదరాబాద్ వ్యాపారులపై దయతో నిజాం సతీమణి బేగం ఓ ప్రాంతాన్ని రాసి ఇచ్చింది. అది కాలక్రమేణా బేగంబజార్ గా నిలిచిపోయింది..

ఖైరతాబాద్:
ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నిసా బేగం కు ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైరతాబాద్ గా మారింది.

హైదర్ గూడా:
మొదటి జిల్లా కలెక్టర్ హైదర్ అలీ పేరుతో హైదర్ గూడా ఏర్పడింది.

మలక్ పేట్:
గోల్కొండ రాజు అబ్దుల్లా కుతుబ్ షా వద్ద పనిచేసే మాలిక్ యాకూబ్ ఇంటి పరిసరాలు ఆయన పేరుతో మలక్పేట్ గా మారింది..

హిమాయత్ నగర్ :
ఏడవ నిజాం పెద్దకుమారుడు హిమాయత్ అలీ ఖాన్ పేరుతో హిమాయత్ నగర్ గా స్థిరపడింది.

శాలిబండ:
శాలిబండ అసలుపేరు షా అలీ బండ. అప్పట్లో షా అలీ అనే ఒక సూఫీ యోగి పెద్ద బండ వద్ద నివసించేవాడు. ఆయన పేరు మీదనే ఆ ఏరియాను షా అలీ బండ అని పిలిచేవారు. అది కాలక్రమేణా శాలిబండ గా మారింది.

మదీనా:
ధర్మదాత ఖాన్ బహదూర్ అల్లాఉద్దీన్ 1900 సంవత్సరంలో నిర్మించిన మూడు అంతస్తుల భవనం వల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది..

చిక్కడపల్లి:
చిక్కడపల్లి అసలుపేరు చిక్కడు పల్లి. చిక్కడ  అంటే మరాఠీలో బురద. ట్యాంక్ బండ్  ప్రాంతం బురద ప్రదేశం . ఆ ఏరియా అప్పట్లో మోకాళ్ళ లోతు బురద ఉండేది. ఇక బురద ఉన్న ప్రదేశం కాబట్టి చిక్కడ్పల్లి అని పిలిచేవారు. ఇక కాలక్రమేణా అది చిక్కడపల్లి గా మారిపోయింది.

ఎర్రమంజిల్:
ఇర్రం మంజిల్ ప్యాలెస్ ఉన్నందుకు ఆ ప్రాంతం ఎర్రమంజిల్ గా స్థిరపడింది..


మరింత సమాచారం తెలుసుకోండి: