ఈ మధ్యకాలంలో టెక్నాలజీ వాడకం విరివిగా పెరిగిపోయింది. ప్రపంచమంతా ఇప్పుడు అర చేతిలోకి వచ్చేసింది. ఒక్క ఫోన్ ద్వారా ఇప్పుడు ఏ పని అయినా చేసేయొచ్చు.. కానీ ఈ ఫోన్ వాడకం వల్లనే ఇప్పుడు అనేక రకాల సమస్యలు కూడా మొదలవుతున్నాయి.. ఫోన్ ఎక్కువగా వాడుతుంటే కళ్ళ సమస్యలతోపాటు బంధాలకు కూడా బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇవాళ దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎక్కువగా విడాకుల కేసులు పెరిగిపోవడానికి కారణం ఫోన్ అంటే నమ్మక తప్పదు. తమ జీవిత భాగస్వాములు ఎక్కువగా ఫోన్ లో గడుపుతూ ఉండడంతో వారు వేరే వారితో ఎక్కడ సంబంధబాంధవ్యాలు నడుపుతున్నారో అనే అనుమానంతో చాలామంది గొడవలు పడుతూ చివరికి విడాకుల దాకా విషయాన్ని తీసుకు వెళుతున్నారు. 

అయితే ఇలాంటి అనుమానాలు మొదలవ్వడానికి ఒక చిన్న మెసేజ్ చాలు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వాట్సాప్ చాటింగ్ ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఒకప్పుడు కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగస్తులు సెలవు కావాలంటే దానికి ఒక సపరేట్ సిస్టం ఉండేది. ఇప్పుడు కరోనా కాలం కావడంతో దాదాపుగా అందరూ వాట్సాప్ అలాగే ఇతర మాధ్యమాల ద్వారా టచ్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక మహిళా ఉద్యోగి తన బాస్ కి సెలవు కావాలని కోరుతూ పంపిన వాట్సాప్ మెసేజ్ స్క్రీన్ షాట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో ముందుగా సదరు ఉద్యోగిని హాయ్ బాస్ నేను గర్భవతిని అని మెసేజ్ చేస్తుంది,

దానికి సదరు బాస్ క్వశ్చన్ మార్క్ తో ఏమైంది అని అడుగుతాడు, దీంతో అప్పుడు ఆమె గర్భవతిని కాబట్టి ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ వద్దకు వెళ్లి ఈ విషయం గురించి చర్చించాలని అందుకే సెలవు కావాలని కోరుతుంది. వెంటనే సదరు బాస్ నువ్వు పంపిన మొదటి రెండు మెసేజ్ లు,  చూసిన మా భార్య ఏదో అనుకుంటుందని అందుకే ముందు ఆవిడతో ఈ విషయం డిస్కస్ చెయ్యమని కోరుతాడు. అలాగే ఈ మెసేజ్ అంతా కలిపి ఒక సారి పెట్టి ఉంటే బాగుండేదని పంపిన మొదటి రెండు మెసేజ్ ల వల్ల చాల అనర్ధాలు జరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. సో ఇలాంటి మెసేజ్ లు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అర్థవంతంగా ఉండేలా పెట్టండి లేదా కొంప కొల్లేరు అవడం ఖాయం మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: