విశ్వాసం.. ఈరోజుల్లో ఇలాంటిది దొరకడం చాలా కష్టం అయిపోయింది. విశ్వాసం వున్న మనుషులు ఈరోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తున్నారనే చెప్పాలి.ఒక మనిషి సాయాన్ని గుర్తించి అతనితో విశ్వాసంగా ఉండటం అనేది ఇప్పుడు కష్టంగా మారింది. ఇక కుక్కలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ ప్రపంచంలో కుక్కలని మించిన విశ్వాసమైన ప్రాణి లేదనే చెప్పాలి.అవి విశ్వాసానికి మారు పేరు. కుక్కలని విశ్వాసానికి సింబల్ గా గుర్తిస్తారు.అవి మనిషి కోసం ఏమైనా చేస్తాయి.అవి అన్నం పెట్టిన మనిషికి చాలా విశ్వాసంగా ఉంటాయి. అస్సలు వదిలిపెట్టవు.ప్రాణం పోయిన కాని తమ యజమానులను వదిలిపెట్టవు.అలాగే తన యజమానికి ఏం జరిగిన తట్టుకోలేవు. ఎవ్వరితోనైనా ఫైట్ చేస్తాయి. తన యజమానికి అతని ఇంటికి రాత్రింబవళ్ళు కాపలా ఉంటాయి కుక్కలు. తమ యజమాని చిరకాలం చచ్చిపోయే దాకా తోడుంటాయి. ఇక మనుషులు అయినా కాని కాలాన్ని బట్టి మారిపోతారేమో. కానీ, కుక్కలు మాత్రం అలా మారిపోవు.అవి చచ్చే వరకు ఎంతో విశ్వాసంతోనే ఉంటాయి.వాటిని ఒక్కసారి ప్రేమగా చూసుకుంటే చాలు లైఫ్ లాంగ్ తమ ప్రేమని చూపిస్తాయి. అందుకే ఏ మనిషి అయినా విశ్వాసంగా లేకపోతే నీ కంటే కుక్క చాలా బెటర్ అని తిడుతుంటారు.


తమ యజమానికి ఎంత చిన్న కష్టమొచ్చినా తల్లడిల్లిపోతాయి. ఇందుకు ఈ వీడియోలో ఈ కుక్కే నిదర్శనం. ఇక టర్కీలోని ఇస్తంబుల్‌లో గల బుయుకదా ఐలాండ్‌లో ఓ వ్యక్తి అనారోగ్యానికి గురవ్వడం జరిగింది. దీంతో ఆ వ్యక్తిని అంబులెన్సులో హాస్పిటల్‌కు తరలించారు. అయితే, ఆ వ్యక్తి ముద్దుగా పెంచుకుంటున్న తన పెంపుడు కుక్క.. తన యజమానికి ఏం జరిగిందోనని ఏమైందోనని తల్లడిల్లిపోయింది. ఇక దీంతో భయంతో అది అంబులెన్సు వెంటే పరిగెడుతూ హాస్పిటల్‌‌కు చేరుకుంది. ఇక ఆ తర్వాత హాస్పిటల్ బయటే ఆ కుక్క యజమాని రాక కోసం ఎదురు చూసింది. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.మీరు చూసేయండి.




మరింత సమాచారం తెలుసుకోండి: