న‌లుగురు యువ‌కులు క‌లిసి హైద‌రాబాద్ హుస్సేన్ సాగ‌ర్ లో బైక్‌ని విసిరేశారు.అయితే బైక్‌ని విసిరేయ‌డానికి రీజ‌న్ మాత్రం ఒక్క‌టేనంటున్నారు ఈ యువ‌కులు.దేశ‌వ్యాప్తంగా పెట్రోల్ రేట్లు పెర‌గ‌డం కార‌ణంగా తాము బైక్‌లు న‌డ‌ప‌లేపోతున్నామ‌ని అందుకే నీళ్ల‌లో ప‌డ‌వేసిన‌ట్లు చెప్తున్నారు.నిన్న తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో పెట్రోల్,డీజిల్ రేట్లు పెంపుపై నిర‌స‌న తెలియ‌జేశారు. నిర‌స‌న‌లో భాగంగా యూత్ కాంగ్రెస్ నేత‌లు త‌మ బైక్‌ని హుస్సేన్ సాగ‌ర్‌లో ప‌డేసి వినూత్నంగా నిర‌స‌న తెలిపారు.ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల్ అవుతుంది. పెట్రోల్,డీజిల్ ధ‌ర‌లు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి.ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాల్లో లీట‌ర్ పెట్రోల్ 105 రూపాయ‌ల‌కు చేరింది.కొన్ని చోట్ల 100 రూపాయ‌ల‌కు చేరింది.ఇటు డీజిల్ రేటు కూడా  100 రూపాయ‌ల‌కు చేరింది.గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా డీజిల్ రేట్లు పెరిగాయి.దేశంలోనే అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106 పలుకుతోంది. రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.85కు పెరిగింది. డీజిల్‌ రూ.86.75కు చేరింది. 

హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.99.61, డీజిల్‌ రూ.94.56, ముంబైలో పెట్రోల్‌ రూ.101.04, డీజిల్‌ రూ.94.15గా ఉన్నాయి.ఇక బెంగళూరులో పెట్రోల్‌ రూ.99.05, డీజిల్‌ రూ.91.97, చెన్నైలో పెట్రోల్‌ రూ.97.19.. డీజిల్‌ రూ. 91.42, కోల్‌కతాలో రూ.95.80, డీజిల్‌ రూ.89.60గా ఉన్నాయి. మే 4వ తేదీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 23 సార్లు ఇంధ‌న ధ‌ర‌లు పెరిగాయి.23 సార్ల‌లో మొత్తం పెట్రోల్ ధ‌ర రూ.5.81, డీజిల్ ధ‌ర రూ.6.12 మేర పెరిగింది.ఒక్క జూన్ నెల‌లో పెట్రోల్‌,డీజిల్ రేట్లు పెర‌గ‌డం ఇది ఆరోసారి.ఇటీవ‌ల ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు పెట్రోల్,డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌లేదు. ఎన్నిక‌లు ముగియ‌డంతో వ‌రుస‌గా ఇంధ‌న ధ‌ర‌లు పెరుగుతూ వ‌చ్చాయి.కార‌ణం ఎన్నిక‌ల స‌మ‌యంలో రేట్లు పెంచితే ఆ ప్ర‌భావం ఉంటుంద‌నే భావ‌న‌లో కేంద్రం ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఏదిఎమైన‌ప్ప‌టికి వ‌రుస‌గా పెట్రోల్ రేట్లు పెర‌గ‌డం..ఇటు నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు ఆకాశ‌నంటుతుండంతో సామాన్యులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: