నైరుతి రుతుపవనాల వల్ల మూడు రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షాల ధాటికి మహానగర వీధులన్నీ జలమయంగా మారాయి. డ్రైనేజీలు అయితే చెప్పనవసరం లేదు. సముద్రాల్ల పొంగిపొర్లుతున్నాయి.ఇక ముంబై ప్రజలని అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని మున్సిపల్ అధికారులు సూచించారు.


ఇక గవర్నమెంట్ ఆఫీసర్స్ కొందరు పూర్తి అంకిత భావంతో పని చేస్తారు.వారి విధులను మరింత నిబద్ధతతో నిర్వర్తిస్తూ ప్రజలకు మంచి చేస్తుంటారు.ఇక పూర్తిగా సిబ్బంది సరిగ్గా పనిచేసేలా చర్యలు తీసుకుంటుంటారు. ఇలాంటి ఆఫీసర్స్ కి ప్రజల నుంచి మంచి ప్రశంసలు అందుతుంటాయి. ఇక అలాగే తాజాగా ముంబైలో ఓ మున్సిపల్ ఆఫీసర్ చేసిన పనికి ప్రేక్షకులు సలామ్ కొడుతున్నారు.  పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బివాండి-నిజామ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎన్ఎంసీ) శానిటరీ ఇన్స్పెక్టర్ సువిధ చౌహాన్ తన పరిధిలో పారిశుద్ధ్య పనులను పరిశీలించడం జరిగింది.ఈ క్రమంలో చీరకట్టులోనే ఆ ఆఫీసర్ మ్యాన్హోల్లోకి దిగారు. ఒక నిచ్చెన సాయంతో కింద వరకు దిగి పనులను పరిశీలించడం జరిగింది. ఇక అక్కడ పరిశుభ్రత ఎలా ఉందో చూశారు ఆ ఆఫీసర్. ఇక ఆ తర్వాత బయటికి వచ్చి సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది.


ఇక ఇలా పారిశుద్ధ్య పనులను  ఆ ఆఫీసర్ అంకితభావంతో పర్యవేక్షిస్తున్నారు. బివాండి పరిధిలో పవర్లూమ్ అనే సంస్థ ఈ పనుల కోసం కాంట్రాక్టు తీసుకోవడం జరిగింది. ఇక ఆ సంస్థ ఎలా పని చేస్తుందనే విషయాన్ని తెలుసుకోడానికి చౌహన్ తనిఖీలు చేస్తున్నారు. ఇక అందులోనూ ప్రస్తుతం వర్షాకాలం కావడంతో డ్రైనేజీలో నీరు నిలిచిపోకుండా సరిగ్గా శుభ్రం చేయాలంటూ సిబ్బందికి సూచించడం జరిగింది.


కేవలం చీరకట్టులోనే సువిధ చౌహాన్ మ్యాన్ హోల్‌లోకి దిగి పనులను తనిఖీ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. “ఇలాంటి ఆఫీసర్స్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇంకొంత మంది కావాలి. అప్పుడే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు” అని అందరూ పొగుడుతున్నారు ఈ లేడి ఆఫీసర్ ని. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని చూసి నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: