కరోనా మహమ్మారి వల్ల ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంకా ఈ వైరస్ తో ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. కరోనాను నియంత్రించేందుకు వ్యాక్సిన్ లను ఏర్పాటు చేసినా, లాక్ డౌన్ వంటివి ప్రభుత్వాలు విధించినా, కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గలేదు.ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్  ఉద్రిక్తత చాలా ఎక్కువ అయింది. ఇకపై థర్డ్ వేవ్ కూడా పిల్లల మీద చాలా ప్రభావం చూపుతుందనే  వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఇదే నేపథ్యంలోనే కొంతమంది శాస్త్రవేత్తలు ఒక సెన్సార్ ను రూపొందించారు. ఇక దీని ద్వారా వైరస్ సోకిందో ? లేదో ?  తెలుసుకోవచ్చని తెలిపారు.


ఎవరైనా ఒకరిని ఒక గదిలో 15  నిమిషాల పాటు ఉంచితే, వారు వైరస్ బారిన పడ్డారా ?లేదా? అనే విషయాన్ని ఈ సెన్సార్ ద్వారా గుర్తించవచ్చును.

కేంబ్రిడ్జ్ షైర్ ఆధారిత సంస్థ రోబో విజ్ఞానం  ద్వారా ఈ పరికరం సృష్టించబడింది. అయితే దీనిని విమానం క్యాబిన్లు, స్కూల్ పిల్లల తరగతి గదులు, కార్యాలయాల్లో ఉపయోగిస్తే ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. ఈ పరికరం ద్వారా కరోనా వైరస్ సోకిన వారి వాసనను పసిగట్టగలదు. ఈ పరికరాన్ని మొట్టమొదటిసారిగా లండన్ లోని ఓ యూనివర్సిటీలో పరిశీలించారు.

లండన్ లోని శాస్త్రవేత్తలు కరోనా వ్యక్తి దగ్గర ఉండే కొన్ని  వస్తువులు (స్నాక్స్, బిస్కెట్స్), శరీర అవయవాలను తాకినతువంటి పరికరాలను పరీక్షించగా..98 నుంచి 100 శాతం వైరస్ ను గుర్తించింది. అయితే ఈ పరికరం పి సి ఆర్ కంటే చాలా వేగంగా గుర్తించగలదని అక్కడ పరిశోధకులు తెలిపారు. అక్కడ పరిశోధకులు 54 మందికి పైగా పరిశోధనలు చేయగా అందులో 27 మందికి వైరస్ సోకినట్లు తేలింది.

దాదాపుగా సంవత్సరం నుంచి ఎన్నో దేశాలు కరోనా కట్టడి ప్రయత్నాన్నికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. అయితే ఇప్పటికే కుక్కల ద్వారా , మనుషుల వాసన ద్వారా కరోనా సోకిన వ్యక్తిని గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా ఎలాంటి పరీక్ష లేకుండా మనిషి చెమట ద్వారా కరోనా సోకిందో లేదో కూడా గుర్తించవచ్చని తెలిపారు.

అయితే తాజాగా ఈ  సెన్సార్ పరికరం ద్వారా ఒక రూమ్ లో ఉండే మనిషి యొక్క వాసన ద్వారా కరోనా ను గుర్తించే పరికరాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. దీనివల్ల కరోనా వైరస్ సోకిన వారిని కనుగొనడం చాలా సులభమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. యాంటీ పరికరాలను అందుబాటులో తీసుకువచ్చేందుకు శాస్త్రవేత్తలు చాలా కష్టపడుతున్నారు.. రాను రాను దాదాపుగా మరికొన్ని వేవ్ లు  వచ్చే అవకాశాలు చాలా  ఉన్నాయని,  అందుకే  ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: