ఇక కరోనా మహమ్మరి విజృంభిస్తున్న నేపథ్యంలో గత కొద్ది నెలలుగా అంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నార్త్ ఇండియా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలు చేశారు. దీంతో జనాలు బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి. ప్రతి వీకెండ్‌లో నార్త్ ఇండియా జనాలకు సిమ్లా లేదా కులు - మనాలి, నైనితాల్, రిషికేష్ వంటి ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేసి రావడం అలవాటు. కాని ఈ కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్ వల్ల అది సాధ్యం కాలేదు.

అలాగే ఇక నార్త్ ఇండియా రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లకు పర్యాటక రంగమే ఆధారం. అయితే, లాక్‌డౌన్ వల్ల టూరిస్టుల రాకపోకలు తగ్గడంతో ఆ రాష్ట్రాల్లో ప్రజలు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయాయి. ఇక ప్రస్తుతం అక్కడ కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టడంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నిబంధనల్లో కొన్ని సవరణలు చేసింది. తమ రాష్ట్రానికి వచ్చే టూరిస్టులు ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేయించుకోవలసిన అవసరం లేదని పేర్కొనడం జరిగింది.

ఇక ఈ సమాచారం తెలియగానే  ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల నుంచి ప్రజలు సిమ్లాకు ప్రయాణమయ్యారు. అక్కడ అందమైన చల్లని ప్రదేశంలో ఐసోలేట్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో చత్తీస్‌గడ్ రాష్ట్రం నుంచి సిమ్లా వరకు గల ఘాట్ రోడ్డు వాహనాలతో నిండిపోయింది. ఇక ఈ వీడియోలో సిమ్లాకు పోతున్న ఒక వైపు రోడ్డు పూర్తిగా వాహనాలతో నిండిపోగా అలాగే సిమ్లా నుంచి చత్తీస్‌గడ్ వైపు వచ్చే రోడ్డు మాత్రం చాలా ఖాళీగా ఉండటం ఆశ్చర్యం. అలాగే కొన్ని కిలోమీటర్ల దూరం వరకు నిలిచిపోయిన వాహనాల వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్‌గా మారింది.ఇంకెందుకు ఆలస్యం వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు చూసేయండి. మీ అభిప్రాయాన్ని తెలియ జేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: