కుటుంబ సభ్యులు ఇంట్లో వేడిగా ఉందని రాత్రిపూట బయట నిద్రపోతుండగా.. ముఖానికి మాస్కులు వేసుకుని వచ్చిన ముగ్గురు కామాంధులు ఇక ఆ ఇంటి యజమానిని నిద్రలేపారు. నిద్రలేచిన ఇంటి యజమాని తల మీద రివాల్వర్లు పెట్టి వారిని ఇంట్లోకి లాక్కెళ్లారు. ఇక ఆ ఇంటి యజమానిని తాళ్లతో కట్టేసి అతని భార్య, కుతురిని నగ్నంగా చేశారు. ఇక ఆ యజమాని కళ్ల ముందే అతని భార్యను, కుమార్తెను ఉదయం వరకు సామూహిక అత్యాచారం చేశారు. ఇక ఈ సంగతిని బయటకు చెప్పినా అలాగే పోలీసు కేసు పెట్టినా మరుసటి రోజు మళ్లీ వచ్చి మిమ్మల్ని ఇదే రివాల్వర్లతో కాల్చి చంపేస్తామని ఆ కామాందులు బెదిరించడం కలకలం రేపింది.ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్ లోని మోరాదాబాద్ లో చోటు చేసుకుంది.


పూర్తి వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్ లోని మోరాదాబాద్ లో సుజిత్, సుమ ( వారి విన్నపం మేరకు ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు.ఇక ఈ దంపతులకు 12 సంవత్సరాల కుమార్తె ఉంది. రాత్రి ఇంట్లో వేడిగా ఉందని కుమార్తెతో కలిసి ఈ అమాయకపు దంపతులు ఇంటి బయట నిద్రపోయారు.ఇక అప్పుడు ముగ్గురు కామాంధులు వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.భర్త సుజిత్ కళ్ల ముందే అతని భార్య సుమ అలాగే అతని కుమార్తె మీద ముగ్గురు కామాంధులు పదేపదే గ్యాంగ్ రేప్ చేశారు. ఎవరు కేకలు వేసినా అందర్ని చంపేస్తామని బెదిరించి వాళ్లు కేకలు వెయ్యకుండా రేప్ చేశారు.పొద్దున వరకు ఆ తల్లీ కూతురిని రేప్ చేసి తమ కామం తీర్చుకున్నారు.


ఇక పొద్దున్నే చుట్టుపక్కల వాళ్లు నిద్రలేవకముందే కామాంధులు ఇంటి నుంచి బయటకు వెళ్లి పోవాలని డిసైడ్ అయ్యారు.అలాగే ఈ విషయం గురించి పోలీస్ లకి గాని మరివరకైనా గాని చెప్తే చంపేస్తామన్నారు.ఇక న్యాయం కోసం మరుసటి రోజు ఉదయం రసుజిత్ అతని భార్య, కుమార్తెను తీసుకొని పోలీస్ స్టేషన్ వెళ్లి జరిగిన దారుణం గురించి ఫిర్యాదు చేశారు. అసలే టైమ్ అనుకూలంగా ఈరోజుల్లో మీరెందుకు బయట పడుకున్నారు ? తప్పు పూర్తిగా మీదే,ఇక జరిగిందేదో జరిగింది, సర్లే వెళ్లిపోండి కేసులు ఎందుకు అని ఆ లోకల్ పోలీసులు కేసు నమోదు చెయ్యకుండా నిర్లక్షం చేశారు.


ఇక సుజిత్ అతని కుటంబ సభ్యులు మరోసారి న్యాయం కోసం మోరదాబాద్ జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.ఆ జిల్లా ఎస్పీ చివాట్లు పెట్టడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.ఇక సుజిత్ భార్య కుమార్తె మీద గ్యాంగ్ రేప్ చేసిన కేసులో ఇప్పటికే ఒకరిని అరెస్టు చేశారని, మిగిలిన ఇద్దరి దుండగులు కోసం పోలీసులు బాగా గాలిస్తున్నారని స్థానిక మీడియా తెలిపడం జరిగింది. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: