ఈరోజుల్లో పిల్లలు మామూలు వాళ్ళు కాదు.. అన్నీ అడ్వాన్స్ గా కావాలని అనుకుంటారు. అందుకే ఎం చేసిన కూడా కొత్తగా ఉండాలని తెగ ప్రయత్నిస్తారు. ఇక అలాంటి ఆలోచనలతో జనాలను పిచ్చి వాళ్ళను చేస్తారు. అవి ఒక్కోసారి కోర్టుమెట్లు కూడా ఎక్కుతాయి. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే ఎదురైంది. ఓ మైనర్ బాలుడు తనకు పెళ్లి చేయాలని కోర్టుకు వెళ్ళాడు. దీనికి ఏమని తీర్పు చెప్పాలో తెలియక లాయర్లు తలలు పట్టుకున్నారు.


వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. తన కొడుకు తనకే కావాలని ఓ తల్లి, తన భర్త తన వద్దనే ఉండాలని ఓ భార్య కోర్టు మెట్లు ఎక్కారు. అయితే ఈ విచిత్రమైన కేసుకు సంబంధించి వాదనలు విన్న కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఓ పదహారేళ్ళ కుర్రాడు.. వయస్సులో తనకన్నా పెద్ద ఉన్న అమ్మాయిని ప్రేమించి, పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే తన కొడుకు మైనర్ అని, అతనిని తన వద్దనే ఉండేలా కోర్టు తనకు న్యాయం చేయాలని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అతను తనను ప్రేమించి పెళ్లాడిన భర్త అని, తన వద్దనే ఉండేలా చూడాలని భార్య ధర్మాసనం వద్దు వాపోయింది.


ఇక కుర్రాడు కూడా తనకు తన భార్యే కావాలని మొండి పట్టు పట్టాడు. ఈ విషయం పై పూర్తిగా పరిశీలించిన కోర్టు. తన వాదనలను వినిపించింది. పిల్లాడు ఇప్పుడు మైనర్. తన మైనారిటీ తీరేవరకు షెల్టర్ హోమ్ లో ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం ఆ బాలుడికి మైనార్టీ తీరకపోవడంతో అతడిని 2022 ఫ్రిబ్రవరి 24 వరకు ప్రభుత్వ షెల్టర్‌ హోం నందు ఉంచాలని కోర్టు తీర్పునిచ్చింది. బాలుడి మైనారిటీ తీరాక తన ఇష్టం ఎవరితో నైనా ఉండొచ్చు అని తీర్పును ఇచ్చింది. ప్రస్తుతం ఈ సంఘటన జనాలను ఆలోచనలో పడేసింది. ఈరోజుల్లో పిల్లలు మామూలోళ్లు కాదని సదరు అభిప్రాయాపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: