ఏ ముహూర్తాన చైనాలో వెలుగులోకి వచ్చిందో తెలియదు కానీ.. ప్రపంచ దేశాలను మాత్రం పట్టి పీడిస్తూనే ఉంది కరోనా మహమ్మారి.  రోజురోజుకు ఈ మహమ్మారి కి సంబంధించిన కేసులు వెలుగు లోకి వస్తూ ఉండటంతో... ప్రపంచ దేశాలు మొత్తం భయం గుప్పిట్లోనే బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఒక దశ కరోనా వైరస్ ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అనుకునేలోపే రెండోదశ కరోనా వైరస్ కూడా దూసుకొచ్చింది. ఇక అంతకుమించిన ప్రభావాన్ని చూపుతూ ఎంతోమంది పై పంజా విసిరి మారణహోమం సృష్టించింది రెండోదశ కరోనా వైరస్.



 కరోనా వైరస్ రాకముందు బయట స్వేచ్ఛగా తిరిగే జనాలు  వైరస్ వచ్చినప్పటినుంచి మాస్క్ ముసుగులో భయపడుతూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది  కేవలం ఒక్క దేశంలో మాత్రమే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా ఇలా ప్రతి ఒక్కరూ మాస్క్ ముసుగులోనే కనిపించే పరిస్థితి ఏర్పడింది.  ప్రపంచంలోని అగ్రదేశాల్లో సైతం కరోనా వైరస్ కారణంగా అల్లాడి పోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే మొన్నటి వరకు మాస్క్ ముసుగు లో మగ్గిపోయిన ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే వైరస్  నుంచి బయట పడుతున్నాయి. ఈ క్రమంలోనే మాస్క్ పెట్టుకోవడం  తప్పనిసరి కాదు అంటూ నిబంధనలను తరలిస్తున్నాయి   కొన్ని దేశాల ప్రభుత్వాలు.



 అయితే మాస్కుల వినియోగం భారీగా పెరగడంతో మాస్క్ వ్యర్థాలు కూడా పెరిగిపోయాయి.ఈ క్రమంలోనే వాడి పడేసిన మాస్క్లను మళ్లీ రీసైకిల్ చేసేందుకు కూడా కొన్ని దేశాల ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవలే ఇంగ్లాండ్ లో మాస్కులతో ఒక వినూత్నమైన డ్రెస్ తయారు చేశారు. ఏకంగా వాడి పడేసిన మాస్క్ లను రీసైకిల్ చేసి వాటితో ఒక అదిరిపోయే డ్రెస్ తయారు చేయగా ప్రముఖ మోడల్   ఫాల్ కేథడ్రల్ ముందు ఫోజులు ఇచ్చింది. ఇక ఈ ఫోటోలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..ఇది చూసిన నెటిజన్లు అందరూ ఫిదా అయిపోతున్నారు. 1500 మాస్కులతో ఈ డ్రెస్ తయారు చేశామని ప్రస్తుతం ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు ఈ వినూత్న ప్రయత్నం చేస్తున్నాము అంటూ మాస్క్ తయారు చేసిన వాళ్ళు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: