పనితో పాటు పుట్టిన పాట మనిషికి ఉల్లాసాన్ని ఇస్తుంది. ఈ పాటలో రకరకాల రాగాలు, తాళాలు ఉండగా, రోజుకో కొత్త రాగం కొంగొత్తగా పుట్టుకొస్తుంది. కొంత గొంతుకలు వస్తున్నాయి. పాటల బ్రహ్మ లెజెండరీ సింగర్ బాలు కూడా ఒకప్పుడు ఒక్క పాట కోసం ఎదురు చూసిన సందర్భాలు ఉండొచ్చు. ఈ క్రమంలో కొత్త కొత్త గాయకులను వెలుగులోకి తీసుకొచ్చే ప్రోగ్రాం ఇండియన్ ఐడల్. దేశవ్యాప్తంగా ఉన్న యువతీ యువకుల నుంచి మంచి సింగర్స్ ఎంచుకునేందుకు ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేసి సంగీత ప్రియుల మది దోచుకుని తమకంటూ ప్రత్యేక స్థానం, స్థాయి పొందిన వారు చాలా మంది ఉన్నారు. తెలుగు సింగర్ రేవంత్, శ్రీరాం ఈ ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం ద్వారానే బాగా పాపులర్ అయ్యారు. తాజాగా ఇండియన్ ఐడల్ 12వ సీజన్  కాంపిటీషన్‌లో పాల్గొన్న ఓ గాయకుడు పాట పాడుతూ పాడుతూ సడెన్‌గా మధ్యలో ఆపేశాడు. అది చూసి జడ్జిలు షాక్ అయ్యారు. ఇదంతా ఇటీవల విడుదలైన ప్రోమోలో కనిపించింది. ఇంతకీ ఆ సింగర్ ఎవరు? సింగర్ కావాలనే అలా చేశారా? అసలేం జరిగింది?

ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్ దీప్‌కు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ పట్ల ఆకర్షితుడైన పవన్ దీప్‌కు సింగర్ కావాలనేది డ్రీమ్. ఈ క్రమంలోనే అతడు మ్యూజిక్ నేర్చుకున్నాడు. ఇండియన్ ఐడల్ సీజన్ వన్ నుంచి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తన మధురమైన గాత్రంతో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేశాడు. సోషల్ మీడియాలోనే అతడికి మంచి ఫాలోయింగ్ ఉండగా, అతడి గాత్రానికి నెటిజనాలు ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఇండియన్ ఐడల్ సీజన్ 12లో పార్టిసిపేట్ చేశాడు. ‘హోతన్ సే చులో తుమ్’అనే పాట పాడుతూ తనలోని ప్రతిభ‌ను బయటపెట్టాడు. ఇక ఆ పాట వింటూ మ్యూజిక్ లవర్స్, జడ్జెస్, ఆడియెన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. ‘ప్రేమ్ గీత్’ సినిమాలోని ఈ పాటను గజల్ కింగ్ జగ్జీత్ సింగ్ పాడగా, ఆయనను మరిపించేలా పవన్‌దీప్ పాడాడనడంలో ఆశ్చర్యం, అతిశయోక్తి లేదు.

అయితే, ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. స్టేజీపై పాట పాడుతున్న క్రమంలో పవన్ సడెన్‌గా ఆ సాంగ్ సింగింగ్ ఆపేశాడు. దాంతో పవన్ తోటి ఫ్రెండ్స్, జడ్జెస్, ఆడియన్స్ షాక్ అయ్యారు. అదేంటీ? పాట పాడటం మధ్యలో ఎందుకు ఆపాడని ప్రశ్నించుకున్నారు? ప్రేక్షకులు కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. పవన్ ఇలా చేశాడేంటి? అని తమలో తాము అనుకుంటున్నారు. ఇదంతా సోనీ టీవీ తాజాగా విడుదల చేసిన ఇండియన్ ఐడల్ సీజన్ 12‌కు సంబంధించిన ప్రోమోలో చూడొచ్చు. అయితే, పవన్‌దీప్ ఇలా మధ్యలోనే సింగింగ్ ఆపినట్లు చూపించడం జస్ట్ ప్రోమో కోసం జిమ్మిక్కా? లేదా నిజంగానే ఆయన పాటను మధ్యలోనే ఆపేశాడా? అనే విషయాలు తెలియాలంటే ఫుల్ ప్రోగ్రాం టెలికాస్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: