చాలామంది ఎన్నో ఉన్నత చదువులు చదివి , ఉద్యోగం లేక నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇక అలాంటి వారి కోసమే టిక్ టాక్ ఒక సరికొత్త ప్రయోగం చేయబోతోంది. ఇక సాధారణంగా ఇందులో వీడియోలో వచ్చే మాటలకు లిప్ మూమెంట్ ఇస్తూ, డాన్స్ వీడియో లు చేస్తూ ఎంతో మంది తమ ప్రతిభను చూపి, పాపులారిటీని పెంచుకుంటున్న విషయం తెలిసిందే. అంతే కాదు ఎంతో మంది తమ ప్రతిభను ఈ టిక్ టాక్ వేదికగా ప్రేక్షకులకు తెలియజేసి, తర్వాత టిక్ టాక్ స్టార్ గా మారిపోయిన వారు కూడా చాలా మందే ఉన్నారు. ఇక అంతే కాదు ఈ టిక్టాక్ లో బాగా పాపులారిటీని అందుకొని వెండితెరపై అలాగే బుల్లితెరపై స్థానాన్ని సంపాదించుకున్న నటీమణులు కూడా చాలామంది ఉన్నారు. ఇకపోతే కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ టిక్ టాక్ ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.


అయితే ఈ టిక్ టాక్ ను తిరిగి ప్రారంభించేందుకు, ఈ టిక్ టాక్ ఒక సరికొత్త ప్రోగ్రాం ను తీసుకొచ్చింది. అదేమిటంటే, ఎంతో మంది నిరుద్యోగులను రిక్రూట్ చేసుకుని, వారికి జీతం కూడా ఇస్తుందట. ఇక అందుకే  దరఖాస్తులకు ఆహ్వానం కూడా పలుకుతోంది.# TikTok Resume తో ఒక వీడియో కు మీ లిప్ మూమెంట్ ఇచ్చి వీడియోను పోస్ట్ చేసి ఆ తర్వాత , tiktokresumes.comలో వీడియో లింక్ ను సమర్పించాల్సి ఉంటుంది.

ఇక tiktok మార్కెటింగ్ మేనేజర్ కైలా డిక్సన్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.." మేము ఇలా ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉపాధి కల్పించి, అలాగే వారు జీతం పొందడానికి, మేము  సహాయపడాలని  ఈ చిన్న ప్రయత్నం. మాతోపాటు  చిపో టిల్, టార్గెట్, అలో యోగా, స్వీట్ గ్రీన్ తో పాటు మరెన్నో కంపెనీలు ఈ ఉద్యోగ జాబితాలను సోషల్ మీడియా టుడే ప్రకారం దరఖాస్తు కోసం పోస్ట్ చేశాయి.

అయితే ప్రజలు NYT ప్రకారం ఈ కొత్త ఫీచర్ లో వీడియో రూపంలో పంపించాల్సి ఉంటుంది అని టిక్ టాక్ తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: