ప్రస్తుతం మన దేశంలో రకరకాల అయినటువంటి మొక్కలు చాలానే ఉన్నాయి. వాటిలో మనకి అన్ని పనికొస్తాయని చెప్పలేము. కానీ కొన్ని మొక్కలు ఎన్నో రకాలుగా పనిచేస్తాయి. కొన్ని విషవాయువులను కలిగి ఉంటాయి. అలా కలిగి ఉన్న ఒక మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


కొంత మంది చదువుకునే పిల్లలు హాలిడేస్ వస్తే ఎక్కడికైనా బయటకి వెళ్దాం అని చెప్పి ఫారెస్టు, టూర్ లకి వెళుతూ ఉంటారు. అలాంటి వారు ఈ మొక్క గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఈ మొక్క పేరు ఏమిటంటే"గింపి- గింపి".ఈ మొక్కని ఎక్కడైనా ముట్టుకున్నా.. అందులో ఉన్న ముల్లు గుచ్చుకున్న.. విపరీతమైన అటువంటి నొప్పిని కలుగ చేస్తాయట. ఆ నొప్పి ఎంతలా ఉంటుందంటే.. భరించలేక ఆత్మహత్య చేసుకునేంత ఉంటుందట.అంతేకాదు ఇక చెట్టుకు మరొక పేరు ఏమిటంటే సూసైడ్ ప్లాంట్ అని పిలుస్తారు.
ఈ మొక్క చూసేటప్పుడు చాలా అందంగా కనబడుతుంది. ఈ చెట్టు ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి. ఈ చెట్టు యొక్క ముల్లులు చాలా చిన్నవిగా ఉంటాయి. అవి మన కంటికి కనిపించవు. అందుచేతనే ఇది భయంకరమైన మొక్క గా పేరు పొందింది.
ఈ ముల్లు లో చాలా భయంకరమైన విషం కలిగి ఉంటుంది. ఇది మన శరీరంలోని కలిసి, గుండెను ఆగిపోయేలా చేస్తుంది. దీనిని"క్యాన్సిల్ అండ్ పార్క్" లో ఉన్న ఒక ఆఫీసర్ "ఎర్నీ రైడర్" ఈ మొక్క యొక్క ఆకులను ముట్టుకొని, ఈ ఆకు వల్ల కలిగే నొప్పి ఎలా వుంటుందో స్వయానా ఆయన అనుభవించాడు. ఈ నొప్పి దాదాపుగా 2 సంవత్సరాల వరకు అతనిని వేధించిందట.

వాస్తవానికి ఆకులను ముట్టుకుంటే 2,3 గంటల తరువాత సృహ తప్పి పడిపోవడం, శరీరం మీద దద్దుర్లు రావడం, వల్ల మనిషి ఈ నొప్పిని భరించలేక మరణించడం మేలు అనుకుంటాడు. ఒకవేళ ఈ మొక్కలు ఎండిపోయిన ఆకులను తాగిన ప్రమాదమే.. ఒకవేళ  ఇవి మన శరీరంలో  కుచ్చుకున్నా, దీనికి తాత్కాలికంగా ట్రీట్మెంట్ లు ఉన్నాయి..కానీ పూర్తిగా నయం చేయలేరు.


మరింత సమాచారం తెలుసుకోండి: