ఈ మధ్యకాలంలో చాలా మంది కరోనా వైరస్ నుంచి ప్రాణాలను నిలబెట్టుకోవడం కోసం తప్పనిసరిగా  కోవిడ్ వాక్సిన్ ను  ఎక్కువగా వేయించుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల విఫలమైందని, ఒకప్పుడు ఎన్నో వార్తలు వచ్చాయి. దాంతో ప్రజలు చాలా బెంబేలెత్తి పోయి, ఆ వ్యాక్సిన్ వేయించుకోవడం తగ్గించారు. అయితే ఇదంతా అప్పుడు కానీ ఇప్పుడు అయితే ప్రతి ఒక్కరు వేయించుకున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ల పై సరికొత్త చర్చ మొదలైంది. అదేమిటంటే, సహజ పద్ధతిలో ఏర్పడిన ప్రతిరోధకాలు ఎక్కువ కాలం ఉంటాయా లేక పూర్తి వ్యాక్సిన్ ద్వారా మన శరీరంలో ఉత్పన్నమైన యాంటీబాడీలు ఎక్కువ కాలం నిలుస్తాయా అనే  చర్చ మొదలైంది.


దీనిపై లక్నో కింగ్ జార్జ్ మెడికల్ కళాశాలలో పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో కోవిడ్ -19 కు వ్యతిరేకంగా 2 టీకాల ద్వారా ఎక్కువ రక్షణ కలుగుతుంది అని తేలింది. సహజసిద్ధంగా మన శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీబాడీలు కేవలం మూడు నుంచి నాలుగు నెలలు మాత్రమే ఉంటాయని, ఆ తర్వాత అదృశ్యమవుతాయి అని ఈ అధ్యయనంలో వెల్లడైంది. SARS-CoV-2 కు వ్యతిరేకంగా ఎవరైతే రెండు టీకాలను వేయించుకున్నారో,  వారిలో ఎక్కువగా యాంటీ బాడీస్  ఉత్పత్తి అయినట్లు, వారిని కరోనా  వైరస్ ఏమీ చేయలేదని కూడా నిరూపించారు.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని లక్నో లో వున్న  బ్లడ్ అండ్ ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ విభాగంలో దాదాపుగా ఒకటిన్నర నెలల పాటు ఈ అధ్యయనం జరుగుతున్నట్లు, ఇక సాధారణ వ్యక్తులలో కన్నా, ఒక టీకా తీసుకున్న వారి కంటే , అదనంగా రెండు టీకాలు తీసుకున్న వ్యక్తులలో  యాంటీబాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అయినట్లు సమాచారం. ఇక ఇప్పటికే దాదాపు రెండు వేల మందికి పైగా  ఆరోగ్య కార్యకర్తల యొక్క రక్త నమూనాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు మరో మూడు నెలల పాటు పరీక్షించి, రెండు టీకాలను తీసుకున్న వారి పై పూర్తి అధ్యయనాలు జరిపి, వారిలో యాంటీబాడీలు ఎంత స్థాయిలో ఉత్పత్తి అయ్యాయో తెలుపుతామని బ్లడ్ అండ్ ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ క్యాటగిరి అధిపతి డాక్టర్ తులిక్ చంద్ర తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: