2000 వ సంవత్సరంలో తీసిన ఒక వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఇంతకు ఆ వీడియో లో ఏముంది.. ?ఎవరు ఆ వీడియోను చేశారు..? అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

జెఫ్ బెజోస్.. చాలావరకు ఈ పేరును వినే ఉంటారు.. వినని వాళ్లు ఎవరైనా ఉంటే అతను ఎవరో కాదు.. అమెజాన్ వ్యవస్థాపకుడు అలాగే మాజీ సీఈఓ అయిన జెఫ్ బెజోస్. అయితే ఆయన ఇటీవల ఇంకో ముగ్గురితో కలిసి అంతరిక్ష ప్రయాణం చేశాడు. అంతే కాదు అంతరిక్ష సరిహద్దుల వరకు వెళ్లి చరిత్ర సృష్టించాడు జెఫ్ బెజోస్.. టెక్ దిగ్గజాలలో బిలియనీర్ గా గుర్తింపు పొందిన బ్లూ ఆరిజన్ సంస్థ నిర్మించిన రాకెట్ లో వీరు ప్రయాణం చేశారు. ఇకపోతే జెఫ్ బెజోస్ చిన్నప్పటినుంచి అంతరిక్షయానం చేయడం ఆసక్తి అని, ఆయన జీవితంలో అంతరిక్ష అంచుకు వెళ్లాలని అనుకున్నట్లు సమాచారం.


దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు ఆయన ఈ కలకై వేచి చూశాడట. అయితే దాదాపుగా 11 సంవత్సరాల కిందట టెలివిజన్ జర్నలిస్ట్ అయినటువంటి చార్లీ రోజ్ మిస్టర్ జెఫ్ బెజోస్  తో చేసిన ఇంటర్వ్యూ వీడియో నుండి  ప్రస్తుతం ఒక చిన్న వీడియో క్లిప్ ,ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోలో జోక్ బెజోస్ తన కలల గురించి వివరించాడు.


ఈ ఇంటర్వ్యూ లో భాగంగానే ప్రముఖ జర్నలిస్ట్ చార్లీ రోజ్ అమెజాన్ సీఈఓ ను ఇలా ప్రశ్నించాడు.. మీరు ఒకవేళ అమెజాన్ సీఈఓ అయి ఉండక పోయి ఉంటే ఏం చేసేవారు ..?అని అడిగాడు.. అందుకు సమాధానంగా బెజోస్.. "నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండేవాడిని. ముఖ్యంగా కఠినమైన, ఏదైనా సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి సహాయం చేయాలనుకుంటున్నాను.. అంతే కాదు నేను  రాకెట్ షిప్  లోకి వెళ్లి అంతరిక్షంలో కొన్ని విషయాలను తనిఖీ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పాడు..అంతే కాదు అంతరిక్షాన్ని అన్వేషించాలని అనుకుంటున్నాను నేను అని అన్నప్పుడు అందరూ నవ్వారు..


అయితే ఆయన స్పందన చూసి ప్రతి ఒక్కరూ బాగా నవ్వుకున్నారు.. ఇక అంతే కాదు.." మీరు మీ మనసును కనుక దృష్టిలో పెట్టుకున్నట్లైతే, తప్పకుండా మీకు ఒక మార్గం కూడా కనిపిస్తుంది. కాబట్టి జీవితంలో ఏదైనా సాధించవచ్చు" అని బెజొస్ తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: