కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ధనుష్ యాక్టింగ్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మొత్తం 150 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి రికార్డు స్థాయిలో హిట్ అయ్యింది. ఇక చాలా మంది సెలెబ్రెటీలను ఈ సినిమా ఆకట్టుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఈ సినిమా గురించి స్పందించాడంటే ఈ సినిమా ఎంతలా ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి ఇంప్రెస్ అయిన టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ ఈ సినిమాని తెలుగులో నారప్ప గా రీమేక్ చేసాడు. ఈ సినిమాని తన అన్న సురేష్ బాబు నిర్మించగా,శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు. థియేటర్ లు తెరుచుకోవడానికి ఆలస్యం అవ్వడంతో ఇక ఈ సినిమాని ఓటీటిలో విడుదల చేశారు. ఇక ఓటీటిలో విడుదలైన ఈ సినిమా మంచి వ్యూస్ తో రికార్డు స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

ఇక ఓ దళిత రైతుగా నటించిన వెంకటేష్ తన కుటుంబాన్ని కాపాడుకునే ఓ పేద కుటుంబ యజమానికి తన యాక్టింగ్ ని ఇరగదీసాడు.ఇక ఈ సినిమాలో వెంకటేష్ యాక్టింగ్ అందరికి నచ్చి ప్రశంసలు అందుకుంటుంటే మాత్రం మహేష్ చిన్న కొడుకు సిన్నబ్బ పాత్ర మాత్రం ఆడియన్స్ కి విపరీతమైన కోపం తెప్పిస్తుంది. కారణం ఇందులో అతను చేసిన దూల పని. ఇతను చేసిన ఆ దూల పని వల్లనే హ్యాపీగా వుండే వెంకటేష్ కుటుంబం చివరిదాకా కష్టాలు పడుతుంది.ఇక అందుకే ఈ సినిమాలో చిన్నబ్బ చేసిన పనికి దూలప్ప అని పేరు పెట్టి మీమ్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు మీమర్స్. ప్రస్తుతం ఈ మీమ్స్ నెట్టింట తెగ వైరల్ అవుతూ హల్ చల్ చేస్తున్నాయి.ఇక ఆడియన్స్ కూడా కోపంతో కామెంట్స్ చేస్తూ దూలప్ప అని తెగ ట్రోల్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: